Lotus Plant : నీటి కుంటలలో, చెరువులలో పెరిగే మొక్కలలో తామర మొక్క కూడా ఒకటి. తామర పువ్వులు చూడడానికి ఎంతో అందంగా ఉంటాయి. పూర్వకాలంలో తామర మొక్కలు ఎక్కువగా కనిపించేవి. కానీ ప్రస్తుత కాలంలో ఈ మొక్కలు ఎక్కువగా కనిపించడం లేదు. హిందూ సాంప్రదాయంలో తామర పువ్వులకు ఎంతో విశిష్టత ఉంటుంది. నీటిని శుభ్రం చేయడంలో తామర మొక్క ఎంతో ఉపయోగపడుతుంది. తామర మొక్కలో ప్రతి భాగం ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. మనకు వచ్చే శారీరక, మానసిక బాధలను తగ్గించడంలో ఈ మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది. తామర మొక్క తీపి, వగరు, చేదు రుచులను కలిగి చలువ చేసే గుణాన్ని కలిగి ఉంటుంది. తామర మొక్కలో తెల్ల తామర, నీలి తామర, నల్ల తామర, ఎర్ర తామర వంటి రకాలు ఉంటాయి.
నల్ల తామర మొక్క లభించడం చాలా కష్టం. మనకు వచ్చే అనారోగ్య సమస్యలను నయం చేయడంలో తామర మొక్క ఏవిధంగా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. తామర పువ్వుల రేకులను 20 గ్రాముల మోతాదులో తీసుకుని వాటికి ఒక టీ స్పూన్ తేనెను, ఒక టీ స్పూన్ వెన్నను, ఒక టీ స్పూన్ చక్కెరను కలిపి రెండు పూటలా తీసుకుంటూ ఉంటే సకల మూల వ్యాధులు తగ్గుతాయి. తామర గింజలలో ఉండే పప్పును ఒక లీటర్ నీటిలో వేసి ఒక గంట పాటు నానబెట్టి వడకట్టి ఆ నీటిని కొద్ది కొద్దిగా తాగుతూ ఉండడం వల్ల అతి దాహం సమస్య తగ్గుతుంది. తామర దుంప, మొగిలి గడ్డ, దోరగా వేయించిన పిప్పిళ్లు, దోరగా వేయించిన శొంఠి సమపాళ్లలో తీసుకుని విడివిడిగా చూర్ణంగా చేసి మొత్తం కలిపి నిల్వ చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని ఒక గ్రాము మోతాదులో 2 గ్రాముల తేనెతో కలిపి రెండు పూటలా తినిపించి వెంటనే తెల్ల మద్ది చెక్క కషాయాన్ని తాగించడం వల్ల పిల్లల్లో గుండె జబ్బులు తగ్గి శరీరానికి బలం చేకూరుతుంది.
తామర గింజలను తేనెతో కలిపి మెత్తగా నూరి ఆ గంధాన్ని బొడ్డుకు లోపల పట్టించి ఆరిన తరువాత సంభోగంలో పాల్గొంటే పురుషులలో వీర్య స్థంభన కలుగుతుంది. తామర తూడును ముక్కలుగా చేసి ఆవు నెయ్యిలో వేయించి వాటిని అన్నం, ఆవు పెరుగుతో కలిపి తింటే స్త్రీలలో ఎర్ర బట్ట సమస్య తగ్గుతుంది. తామర పువ్వులను కాడతో సహా సేకరించి వాటిని మెత్తగా నూరి చిటికెన వేలంత పొడువు మాత్రలను చేసి నీడలో ఎండబెట్టి నిల్వ చేసుకోవాలి. యోని విశాలంగా ఉండే స్త్రీలు వీటిని యోని లోపల ఉంచి మూడు గంటల తరువాత తీసేసి శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల స్త్రీలల్లో యోని బిగువుగా అవుతుంది.
తామర గింజల పొడి 100 గ్రాములు, చక్కెర పొడి 200 గ్రాముల మోతాదులో తీసుకుని నిల్వ చేసుకోవాలి. దీనిని రోజూ రెండు పూటలా ఒక టీ స్పూన్ మోతాదులో తింటూ ఉండాలి. అలాగే తామర పువ్వులను మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని స్థనాలపై ఉంచి కట్టు కట్టాలి. ఇలా నెల రోజుల పాటు చేయడం వల్ల స్త్రీలల్లో స్థనాలు గట్టిగా మారుతాయి. 20 గ్రాముల తామర రేకులను తీసుకుని ఒక గ్లాస్ నీటిలో వేసి ఒక కప్పు కషాయం అయ్యే వరకు మరిగించి వడకట్టి తాగుతూ ఉండడం వల్ల క్షయ వ్యాధి నయం అవుతుంది.
తెల్ల తామర పువ్వుల రేకులను వాటికి నాలుగు రెట్ల నీటిలో వేసి నాలుగో వంతు కషాయం అయ్యే వరకు మరిగించి వడకట్టాలి. దీనికి సమానంగా చక్కెరను కలిపి లేత పాకం వచ్చే వరకు ఉంచాలి. దీనిని రోజూ రెండు పూటలా 2 టీ స్పూన్ల మోతాదులో అర కప్పు ఆవు పాలతో కలిపి సేవిస్తూ ఉంటే శరీరానికి అమితమైన బలం కలుగుతుంది. ఈ విధంగా ఎన్నో రకాల సమస్యలను తగ్గించడంతోపాటు శారీరక బలాన్ని చేకూర్చడంలోనూ తామర మొక్క ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.