Hibiscus Flowers : పురుషుల్లో ఉండే సంతానలేమి సమస్యల్లో వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉండడం కూడా ఒకటి. పురుషుల్లో వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉండడం, వాటి నాణ్యత తక్కువగా ఉండడం కారణంగా కొందరికి సంతానం కలగదు. పురుషుల్లో ఈ సమస్య రావడానికి అనేక కారణాలు ఉంటాయి. మానసిక ఒత్తిడి, ఆందోళన, మద్యపాసం, ధూమపానం, అధిక బరువు, మాదక ద్రవ్యాల వినియోగం, శరీరంలో ఉండే అధిక వేడి, ఇన్ ఫెక్షన్ ల కారణంగా పురుషుల్లో వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉంటుంది. ఈ సమస్యను నుండి బయటపడడానికి వైద్యులు మనకు మందులను సూచిస్తారు. ఈ సమస్య నుండి బయటపడడానికి ఆయుర్వేదంలో కూడా అనేక రకాల మార్గాలు ఉన్నాయి.
పురుషుల్లో వీర్య కణాల సంఖ్యను పెంచడంలో మందార చెట్టు మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మన ఇంట్లో అందం కోసం పెంచుకునే మందార చెట్టును ఉపయోగించడం వల్ల పురుషుల్లో వీర్య కణాల సంఖ్య, వాటి నాణ్యత పెరుగుతుంది. మందార పువ్వులను బాగా ఎండబెట్టి పొడిలా చేసుకుని నిల్వ చేసుకోవాలి. ఈ మందార పువ్వుల పొడి మనకు ఆయుర్వేద దుకాణాలలో కూడా లభ్యమవుతుంది. రోజూ రెండు టీ స్పూన్ల పొడిని తిని వెంటనే ఒక గ్లాస్ పాలను తాగాలి. ఇలా 40 రోజుల పాటు చేయడం వల్ల పురుషుల్లో వీర్య కణాల సంఖ్య, వాటి నాణ్యత పెరిగి సంతానాన్ని పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
అంతేకాకుండా ఈ మందార పువ్వుల పొడిని నీటిలో వేసుకుని కషాయంలా చేసుకుని తాగడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ఈ మందార పువ్వుల కషాయాన్ని తాగడం వల్ల మనం ఇతర ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఈ కషాయాన్ని తాగడం వల్ల అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఒత్తిడి, ఆందోళనతో బాధపడుతున్న వారు మందార పువ్వులతో చేసిన కషాయాన్ని తాగడం వల్ల ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ విధంగా మందార పువ్వులు మనకు ఎంతగానో ఉపయోగపడతాయని నిపుణులు తెలియజేస్తున్నారు.