Coriander Fennel Seeds : ప్రస్తుత కాలంలో ఆహారపు అలవాట్ల కారణంగా.. జీవన విధానంలో మార్పు, శారీరక శ్రమ లేకపోవడం వంటి వివిధ రకాల కారణాల వల్ల అనారోగ్యాల బారిన పడే వారు ఎక్కువవుతున్నారు. ముఖ్యంగా చిన్న వయస్సులోనే చాలా మంది రక్త నాళాల్లో పూడికలు ఏర్పడి గుండె జబ్బులు, హార్ట్ ఎటాక్ ల బారిన పడుతున్నారు. అంతేకాకుండా కీళ్ల నొప్పులు, నరాల బలహీనత, సయాటికా వంటి వివిధ అనారోగ్యాలతో బాధపడే వారు మనలో చాలా మందే ఉన్నారు. ఈ సమస్యల నుండి బయటపడడానికి మనం వివిధ రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అంతేకాకుండా వైద్యం కోసం ఎంతో డబ్బు ఖర్చు చేస్తూ ఉంటాం. సహజ సిద్ధంగా కేవలం ఇంట్లో ఉండే పదార్థాలతోనే ఒక టీ ని తయారు చేసుకుని తాగడం వల్ల మనం ఈ సమస్యల నుండి బయటపడవచ్చు.
ఈ టీ ని తయారు చేసుకుని తాగడం వల్ల రక్త నాళాల్లో ఎటువంటి పూడికలు ఏర్పడకుండా ఉంటాయి. అంతేకాకుండా హార్ట్ ఎటాక్, వెరికోస్ వీన్స్ వంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ టీ ని ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ టీ ని తయారు చేసుకోవడం కోసం ధనియాలను, సోంపు గింజలను, పటిక బెల్లాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక టీ స్పూన్ ధనియాలను, ఒక టీ స్పూన్ సోంపు గింజలను కళాయిలో వేసి రంగు మారే వరకు వేయించాలి. తరువాత వీటిని ఒక గ్లాస్ నీటిలో వేసి అర గ్లాసు నీరు అయ్యే వరకు బాగా మరిగించాలి. తరువాత ఈ నీటిని వడకట్టి అందులో ఒక గ్రాము పటిక బెల్లాన్ని వేసి కలిపి తీసుకోవాలి. షుగర్ వ్యాధి గ్రస్తులు మాత్రం పటిక బెల్లాన్ని కలిపి తీసుకోకూడదు. ఈ టీ ని వారంలో ఒక్కసారి తాగడం వల్ల రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వు కరగడమే కాకుండా అడ్డంకులు కూడా తొలగిపోతాయి.
ఈ టీ ని తాగడం వల్ల సయాటికా నొప్పులు, వెరికోస్ వీన్స్ వంటి సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. నరాల బలహీనతను తగ్గించడంలో, రక్త నాళాల్లో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను, అడ్డంకులను తొలగించడంలో, సయాటికా నొప్పులను తగ్గించడంలో ధనియాలు, సోంపు గింజలు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటితోపాటు ఒక రాగి పాత్రలో నీటిని తీసుకుని అందులో ధనియాలను వేసి ఒక రాత్రంతా నానబెట్టాలి. ఇలా నానబెట్టిన ధనియాలను మట్టిలో వేసి కొత్తిమీరను పెంచుకోవాలి. రాగి పాత్రలో నానబెట్టిన ధనియాల నుండి వచ్చిన కొత్తిమీర కనుక దీనిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
ఈ కొత్తిమీరను వంటల్లో వాడడం లేదా జ్యూస్ గా చేసుకుని తాగడం వల్ల రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వు, అడ్డంకులు తొలగిపోవడమే కాకుండా, సయాటికా, వెరికోస్ వీన్స్, నరాల బలహీనత వంటి సమస్యలు తగ్గు ముఖం పడతాయి. ధనియాలతో చేసిన టీ ని తాగడం వల్ల, అలాగే రాగిపాత్రలో నానబెట్టిన ధనియాలతో పెంచిన కొత్తిమీరను వాడడం వల్ల పైన తెలిపిన సమస్యలు తగ్గడంతోపాటు భవిష్యత్తులోనూ ఆయా సమస్యలు రాకుండా ఉంటాయి.