మనలో కొందరికి ముఖం తెల్లగా ఉన్నప్పటికీ మెడ భాగంలో మాత్రం చర్మం నల్లగా ఉంటుంది. దీని వల్ల ఎటువంటి సమస్య లేనప్పటికీ చూడడానికి మాత్రం అందవిహీనంగా ఉంటుంది. ఎండకు ఎక్కువగా తిరగడం, అధిక బరువు, హర్యోన్ల అసమతుల్యత, గర్భధారణ, మెడ భాగాన్ని సరిగ్గా శుభ్రపరుచుకోకపోవడం వంటి తదితర కారణాల వల్ల మెడ భాగం నల్లగా మారుతుంది. మెడ భాగంలో ఉండే నలుపును పోగొట్టడానికి మనం చేయని ప్రయత్నం అంటూ ఉండదు. ఇంటి చిట్కాను ఉపయోగించి ఎటువంటి ఖర్చు లేకుండానే చాలా తక్కువ సమయంలోనే మనం ఈ సమస్య నుండి బయట పడవచ్చు.
మెడ నలుపును తొలగించే ఆ ఇంటి చిట్కా ఏమిటి.. దీనిలో వాడే పదార్థాల గురించి .. అదే విధంగా ఈ చిట్కాను ఏవిధంగా ఉపయోగించాలి.. వంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలో తెల్లగా ఉండే ఏదో ఒక టూత్ పేస్ట్ ను ఒక టేబుల్ స్పూన్ మోతాదులో తీసుకోవాలి. తరువాత ఇందులోనే ఒక టీ స్పూన్ కలబంద గుజ్జును వేసి రెండు కలిసేలా బాగా కలపాలి. తరువాత ఒక గిన్నెలో గోరు వెచ్చని నీటిని తీసుకుని అందులో ఒక టీ స్పూన్ ఉప్పును వేసి ఉప్పు కరిగే వరకు తిప్పాలి. తరువాత ఈ నీటిలో శుభ్రమైన కాటన్ వస్త్రాన్ని ముంచి బయటకు తీసి ఎక్కువగా ఉన్న నీటిని పిండేయాలి. తరువాత ఈ కాటన్ వస్త్రంతో మెడ చుట్టూ 5 నిమిషాల పాటు శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల మెడ భాగంలో చర్మం రంధ్రాలు తెరుచుకుని చర్మం శుభ్రపడుతుంది.
తరువాత ఫేస్ టవల్ తో మెడ భాగాన్ని శుభ్రపరుచుకోవాలి. ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న పేస్ట్ మిశ్రమాన్ని మెడ భాగంలో చర్మంపై రాయాలి. తరువాత ఈ మిశ్రమం చర్మంలోకి ఇంకేలా 5 నుండి 10 నిమిషాల పాటు సున్నితంగా మర్దనా చేసి పూర్తిగా ఆరే వరకు ఉంచాలి. తరువాత చల్లని నీటితో మెడ భాగాన్ని శుభ్రపరుచుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల మెడ భాగంలో నల్లగా ఉండే చర్మం తెల్లగా మారుతుంది. అలాగే మెడ భాగంలో చర్మంపై ఉండే మృతకణాలతోపాటు ముడతలు కూడా తొలగిపోతాయి. ఈ చిట్కా చిన్నదే అయినప్పటికీ చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది. ఈ చిట్కాను ఉపయోగించి చాలా సులభంగా నల్లగా ఉండే చర్మాన్ని తెల్లగా మార్చుకోవచ్చు.