Piles : పైల్స్.. ఈ సమస్యతో బాధపడే వారు కూడా మనలో చాలా మంది ఉంటారు. ఈ సమస్య బారిన పడిన వారి బాధ వర్ణానాతీతం అని చెప్పవచ్చు. ఈ పైల్స్ వల్ల కలిగే నొప్పి కారణంగా కనీసం 5 నిమిషాల పాటు ఒకే ప్రదేశంలో కూర్చొలేకపోతారు. సమస్య మరీ ఎక్కువైనప్పుడు మల విసర్జన చేసేటప్పుడు నొప్పి, రక్తం కారడం వంటివి కూడా జరుగుతాయి. అంతేకాకుండా ఇతరులకు కూడా సమస్యను చెప్పుకోలేక వారిలో వారే ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ సమస్య రావడానికి కూడా అనేక కారణాలు ఉంటాయి. అధిక బరువు, పీచు పదార్థాలు కలిగిన ఆహార పదార్థాలను తక్కువగా తీసుకోవడం, మలబద్దకం, ప్రేగుల్లో కదలికలు తక్కువగా ఉండడం, అధిక బరువులు ఎత్తడం, నీరు ఎక్కువగా తాగకపోవడం వంటి వాటిని పైల్స్ రావడానికి కారణాలుగా చెప్పవచ్చు.
అలాగే గర్భిణీలలో కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమస్య నుండి బయటపడడానికి వైద్యులు మనకు సర్జరీని ఎక్కువగా సూచిస్తూ ఉంటారు. పైల్స్ సమస్య మరీ తీవ్రతరం కాకుండా ప్రారంభదశలో ఉన్నప్పుడు మాత్రం ఇంటి చిట్కాలను ఉపయోగించి మనం ఈ సమస్య నుండి బయటపడవచ్చు. ప్రారంభ దశలో ఉన్న పైల్స్ సమస్య నుండి బయటపడేసే ఇంటి చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పైల్స్ సమస్యతో భాదపడే వారు ఈ చిట్కాను వాడడం వల్ల సర్జరీ అవసరం లేకుండానే సహజసిద్ధంగా ఈ సమస్య నుండి ఉపశమనాన్ని పొందవచ్చు. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గాను ముందుగా ఒక గ్లాస్ నీటిని తీసుకోవాలి. తరువాత ఈ నీటిలో అర చెక్క నిమ్మ రసంతోపాటు పావు టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని వేసి కలపాలి.
ఇలా తయారు చేసుకున్న నీటిని రోజూ ఉదయం పరగడుపున తాగడం వల్ల పైల్స్ సమస్య త్వరగా తగ్గుముఖం పడుతుంది. ఈ చిట్కాను పాటించడం వల్ల పైల్స్ సమస్యతోపాటు మలబద్దకం, గ్యాస్, అజీర్తి, అసిడిటీ వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. అదే విధంగా ఈ చిట్కాను పాటిస్తూనే కొన్ని జాగ్రత్తలను కూడా తీసుకోవాలి. ఈ సమస్యతో బాధపడే వారు రోజుకు కనీసం 4 నుండి 5 లీటర్ల నీటిని తీసుకోవాలి. అలాగే పీచు పదార్థాలు కలిగిన ఆహారాలను, త్వరగా జీర్ణమయ్యే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. జంక్ ఫుడ్ కు, నూనె, మసాలా ఎక్కువగా వేసి చేసే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. ఈ నియమాలను పాటించడంతోపాటు పైన తెలిపిన చిట్కాను ఉపయోగించడం వల్ల పైల్స్ సమస్య నుండి విముక్తి కలుగుతుంది.