మహాభారతంలోని పాత్రలలో కర్ణుడు ఒకరు. తన జీవితాంతం కర్ణుడు కర్మను నమ్మాడు. తన జీవితాన్ని చాలా ధైర్యంగా ఆస్వాదించాడు. తన జీవితంలో అనేక సమస్యలు, కష్టాలు ఎదుర్కొన్నాడు. కానీ.. కర్ణుడి నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలెన్నో ఉన్నాయి. మహాభారత యుద్ధంలో కర్ణుడి సద్గుణాలు మనం తెలుసుకోవచ్చు. కర్ణుడి ద్వారా మనకు ఎన్నో విలువలు అర్థమవుతాయి. ఎలాంటి కష్టాన్నైనా.. ఓర్పుతో ఎలా ఎదుర్కోవాలనే విషయాన్ని మహాభారతంలో కర్ణుడి ద్వారా తెలుసుకోవాలి. ఇది మాత్రమే కాదు.. కర్ణుడి నుంచి నేర్చుకోవాల్సిన, మనలో స్పూర్తినింపే లక్షణాలు అనేకం ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.. మహాభారతంలో కర్ణుడు చాలా శక్తివంతమైన వ్యక్తి. అర్జునుడి కంటే… కర్ణుడే బలశాలి. కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు పాండవులకు సహాయపడ్డాడు. అలాగే ఇంద్రుడు కూడా కర్ణుడి కవచం తొలగించి అర్జునుడికి సహాయం చేశాడు.
ఉదారస్వభావానికి కర్ణుడు చాలా ఫేమస్. కర్ణుడు బంగారపు చెవి పోగులతో జన్మించాడు. ఇవే.. అతనికి రక్షగా ఉన్నాయి. ఇది తెలుసుకున్న ఇంద్రుడు కర్ణుడిని చెవిపోగులు, కవచం ఇవ్వాలని కోరాడు. కర్ణుడు ఉదారస్వభావం కలిగినవాడు కావడంతో.. వాటిని వెంటనే ఇంద్రుడికి ఇచ్చేశాడు. బాణాలు విసరడంలో కర్ణుడుకి సాటిలేరు. అర్జునుడి కంటే.. కర్ణుడే అద్భుతంగా బాణాలు వేయగలడు. ఎలాంటి దాన ధర్మాలు చేయడానికైనా.. కర్ణుడు ఏ మాత్రం వెనకాడడు. అయితే.. కర్ణుడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే.. ఇంద్రుడు దానం చేయాలని కోరాడు. తన దగ్గర ఏమీ లేదని కర్ణుడు వివరించాడు. అయితే.. తన బంగారు పంటిని బహుమానంగా ఇవ్వాలని కోరారు. వెంటనే కర్ణుడు దాన్ని దానం చేశారు. కురుక్షేత్ర యుద్దం తర్వాత వెంటనే కుంతీ దేవి దగ్గరకు వెళ్లిన కర్ణుడు.. తనే తన తల్లి అని వివరించాడు. పాండవుల్లో తాను పెద్దవాడు కాబట్టి.. తననే రాజు కావాలని కుంతీ సూచించింది. అయితే తాను తన స్నేహితుడిగా భావించే దుర్యోధనుడిని మోసం చేయాలనుకోవడం లేదని వివరించాడు.
ధుర్యోదనుడిని వదిలిపెట్టి.. పాండవుల్లో కలిసిపొమ్మని శ్రీకృష్ణుడు కూడా బతిమాలాడు. రాజ్యాన్ని, ద్రౌపదిని కూడా ఇస్తానని చెప్పాడు. కానీ.. కర్ణుడు మాత్రం తన విలువలను నమ్మాడు. రాజ్యం కోసం ధుర్యోదనుడిని విడిచిపెట్టకూడదని భావించాడు. కర్ణుడు చాలా తెలివైనవాడు, నీతి, నిజాయితీ పాటిస్తాడు. చాలా శక్తివంతమైన వ్యక్తి. అలాగే చాలా అందమైనవాడు. ఈ గుణాలన్నీ పాండవులకు కూడా ఉన్నాయి. సహదేవుడు తెలివి తేటలు, యుధీస్త్రీరాకి మోరల్ వ్యాల్యూస్, అర్జునుడు గొప్పగా విల్లువేసేవాడు, భీముడు శారీరక బలం కలిగిన వాడు, నకులుడు శారీరకంగా ఆకట్టుకునే వ్యక్తి. అయితే వీళ్లకు ఒక్కొక్కరికి ఉన్న గుణాలన్నీ కర్ణుడిలోనే ఉండటం విశేషం.