Turmeric Pepper : భారతీయుల వంట గదిలో పసుపు, మిరియాలు తప్పకుండా ఉంటాయి. పసుపును మనం నిత్యం వంటల్లో ఉపయోగిస్తూ ఉంటాం. అలాగే మిరియాలను కూడా వివిధ రకాల వంటకాల్లో ఉపయోగిస్తూ ఉంటాం. పసుపు, మిరియాలు ఇవి రెండు కూడా ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. అలాగే ఇవి రెండు కూడా మన ఆరోగ్యానికి మేలు చేసేవే. అయితే పసుపు, మిరియాలను వేరు వేరుగా తీసుకోవడానికి బదులుగా వీటిని కలిపి తీసుకోవడం వల్ల మనం మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. రోజూ ఉదయం పరగడుపున ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో పావు టీ స్పూన్ పసుపును, చిటికెడు మిరియాల పొడిని కలుపుకుని తాగడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
పసుపును, మిరియాల పొడిని కలిపిన నీటిని ప్రతి రోజూ పరగడుపున తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ శుభ్రపడుతుంది. అంతేకాకుండా శరీరంలోని వ్యర్థ పదార్థాలన్ని కూడా తొలగిపోతాయి. దీంతో జీవక్రియలు వేగవంతం అవుతాయి. పసుపు, మిరియాల పొడిని కలిపిన నీటిని తాగడం వల్ల చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి. చర్మం ఆరోగ్యవంతంగా తయారవుతుంది. అంతే కాకుండా ఈ నీటిని తాగడం వల్ల గాయాలు, పుండ్ల వంటివి త్వరగా మానుతాయి. అంతేకాకుండా ఇలా తయారు చేసుకున్న నీటిని తాగడం వల్ల రక్తనాళాలతోపాటు శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ కూడా కరిగిపోతుంది. తద్వారా బరువు తగ్గడంతోపాటు గుండె సంబంధిత సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.
పసుపు అలాగే మిరియాలకు క్యాన్సర్ కణాలను నిర్మూతించే శక్తి ఉంటుంది. కనుక పసుపు, మిరియాల పొడి కలిపిన నీటిని తాగడం వల్ల పలు రకాల క్యాన్సర్ లు వచ్చే అవకాశం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ నీటిని తాగడం వల్ల అల్జీమర్స్ వచ్చే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి. తరచూ అనారోగ్యా బారిన పడే వారు, ఇన్ ఫెక్షన్ లతో బాధపడే వారు పసుపు, మిరియాల పొడి కలిపిన నీటిని తాగడం వల్ల చక్కని ఫలితం ఉంటుంది. రోజూ పరగడుపున ఈ నీటిని తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి రోగాల బారిన పడకుండా ఉంటారు.
కీళ్ల నొప్పులతో బాధపడే వారు కూడా పసుపు, మిరియాల పొడి కలిపిన నీటిని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. పసుపులో అదే విధంగా మిరియాల్లో యాంటీ ఇన్ ఫ్లామేటరీ లక్షణాలు ఉంటాయి. కనుక ఈ నీటిని తాగడం వల్ల శరీరంలో ఉండే నొప్పులు, వాపులు తగ్గిపోతాయి. షుగర్ వ్యాధితో బాధపడే వారికి కూడా ఈ నీరు ఎంతగానో ఉపయోగపడుతుంది. పసుపును, మిరియాల పొడిని నీటిలో కలుపుకుని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. పసుపు, మిరియాల పొడిని కలిపిన నీటిని తాగడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని, ఈ నీటిని తాగడం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గడంతోపాటు భవిష్యత్తులో కూడా రాకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.