Shampoo : మన జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే మనం తలంటు స్నానం తప్పని సరిగా చేయాలని మనందరిక తెలుసు. పూర్వకాలంలో తలంటు స్నానం చేయడానికి కుంకుడు కాయలను, శీకాకాయలను ఉపయోగించేవారు. ఇవి రెండు కూడా సహజసిద్ధమైనవే. వీటిని వాడడం వల్ల జుట్టు ఆరోగ్యంగా, నల్లగా, ఒత్తుగా పెరిగేది. తెల్ల వెంట్రుకలు అనేవి వయసు పైబడే వరకు ఎవరిలోనూ కనిపించేవి కావు. అలాగే జుట్టు రాలడం కూడా తక్కువగా ఉండేది. కుంకుడుకాయలు, శీకాకాయలు జుట్టుకు బలాన్ని ఇచ్చి చక్కగా సంరక్షించేవి.
అలాగే పూర్వకాలంలో సబ్బులకు బదులుగా నలుగు పిండిని ఉపయోగించేవారు. నలుగు పిండిని ఉపయోగించడమనేది పూర్వకాలంలో ఆనవాయితీగా ఉండేది. కానీ ప్రస్తుత కాలంలో షాంపూ పెట్టుకోకుండా స్నానం చేయడమనేది ఎవరికీ సాధ్యమయ్యే పని కాదు. చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు అందరూ షాంపూతోనే స్నానం చేస్తున్నారు. ఈ షాంపూలను వాడడం వల్ల జుట్టుతోపాటు చర్మానికి కూడా హాని కలిగే అవకాశం ఉందని దీని వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు.
షాంపూ లేకుండా తలస్నానం చేయలేని పరిస్థితి నెలకొంది. స్త్రీలు ఈ షాంపూలను మరీ ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. షాంపూల తయారీలో రసాయనాలను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ రసాయనాల కారణంగా క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వారు తెలియజేస్తున్నారు. షాంపులతోపాటు సౌందర్య సాధనాలను, బాడీ లోషన్ లను కూడా మనలో చాలా మంది ఉపయోగిస్తూ ఉంటారు. వీటి తయారీలో కూడా రసాయనాలను ఎక్కువగా వాడతారు. వీటి వల్ల వాటిని ఉపయోగించిన వారిలో చాలా మంది మహిళలు రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నారని శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో వెల్లడైంది.
ఇలా రసాయనాలు కలిగిన షాంపూలను, సౌందర్య ఉత్పత్తులను వాడడం వల్ల క్యాన్సర్ తోపాటు ఇతర దుష్ప్రభావాలు కూడా కలిగే అవకాశం ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు. షాంపూలు, బాడీ లోషన్ లు, సౌందర్య సాధనాలు ఎక్కువ రోజులు ఉండాలనే ఉద్దేశ్యంతో వాటిలో రసాయనాలను కలిపి తయారు చేస్తున్నారు. శరీరంలో ఉండే ఈస్ట్రోజన్ ను పోలిన రసాయనాలను వాడడం వల్ల స్త్రీలల్లో క్యాన్సర్ తోపాటు ఇతర అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. షాంపూలు, కాస్మోటిక్స్, బాడీ లోషన్ లును వాడడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. కనుక సాధ్యమైనంత వరకు సహజసిద్ధ పదార్థాలను వాడాల్సిందింగా నిపుణులు చెబుతున్నారు.