Over Weight : ప్రస్తుత తరుణంలో చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. బరువును తగ్గించుకునేందుకు అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసమే ఎక్సర్‌సైజ్‌లు చేయడం, డైటింగ్ పాటించడం వంటివి చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం ఎంత ప్రయత్నించినా బరువు తగ్గలేకపోతుంటారు. ఇక కొందరు చేసే తప్పులే వారి బరువును పెంచుతున్నాయి. ముఖ్యంగా కొందరు రాత్రి పూట చేస్తున్న తప్పుల వల్ల అధికంగా బరువు పెరుగుతున్నారు. ఈ తప్పులు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రాత్రిపూట చాలా మంది భోజనం తరువాత, ముందు స్నాక్స్ ఎడా పెడా తింటారు. నిజానికి స్నాక్స్‌ను సాయంత్రం 6 గంటల లోపే తినాలి. ఆరు దాటితే నేరుగా భోజనం చేయాలి. అంతే కానీ స్నాక్స్, జంక్‌ఫుడ్ తినరాదు. తింటే బరువు అధికంగా పెరుగుతారు. ఈ తప్పును ఇకపై ఎవరూ చేయకూడదు. నిద్రపోయేందుకు 6 గంటల ముందే కాఫీ తాగడం మానుకోవాలి. కాఫీలో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ బరువును పెంచుతుంది. ముఖ్యంగా రాత్రి పూట కాఫీ తాగితే బరువు పెరుగుతారు. కాఫీకి బదులుగా హెర్బల్ టీ తాగితే బరువు తగ్గవచ్చు. ప్రతి ఒక్కరు నిత్యం 7 నుంచి 8 గంటల నిద్ర పోవాలి. నిద్ర సరిగ్గా లేకపోయినా కూడా బరువు పెరుగుతారని సైంటిస్టుల అధ్యయనాలు చెబుతున్నాయి. కనుక ప్రతి వ్యక్తికి నిద్ర ఆవశ్యకం. రోజూ తప్పనిసరిగా 7 నుంచి 8 గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలి. దీంతో బరువు పెరగకుండా ఉంటారు.
నిత్యం కనీసం 30 నిమిషాల పాటు అయినా వాకింగ్ చేయాలి. ఇది ఎంతో కొంత బరువును తగ్గిస్తుంది. వ్యాయామం చేయకపోతే బరువు పెరుగుతామన్న విషయం గుర్తుంచుకోవాలి. రోజూ 30 నిమిషాల పాటు నడక చేసినా చాలు.. ఎంతో కొంత శారీరక శ్రమ జరుగుతుంది. ఇది బరువును తగ్గిస్తుంది. అయితే కొందరు అసలు ఎలాంటి శారీరక శ్రమ చేయరు. ఈ పొరపాటును కూడా చేయవద్దు. లేదంటే బరువు పెరుగుతారు. ఇక రాత్రి పూట భోజనం చేశాక 30 నిమిషాలు ఆగి 15 నిమిషాల పాటు తేలికపాటి నడక చేస్తే ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా అధిక బరువు, షుగర్, బీపీ సమస్యలు ఉన్నవారికి ఇలా చేయడం ఎంతో మేలు చేస్తుంది.
రాత్రిపూట స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్ల వాడకం తగ్గించాలి. టీవీలను కూడా పొద్దు పోయే వరకు చూడరాదు. చూస్తే నిద్రలేమి సమస్య వస్తుంది. బరువు పెరుగుతారు. రాత్రి త్వరగా నిద్రించి ఉదయం త్వరగా నిద్రలేవాలి. అలాగే నిద్రించే బెడ్‌రూంలో బ్లూ కలర్ లైట్‌ను వాడితే నిద్ర త్వరగా పడుతుంది. దీంతో టైముకు నిద్రపోవచ్చు. బరువు అదుపులో ఉంటుంది. ఇక రాత్రి పూట చాలా ఆలస్యంగా భోజనం చేస్తారు. ఇది కూడా మానుకోవాలి. రాత్రి 7 గంటల లోపు భోజనం ముగించాలి. 10 గంటల వరకు నిద్రించాలి. మరుసటి రోజు ఉదయం 6 గంటలకు నిద్ర లేవాలి. ఈ దినచర్యను రోజూ పాటించాలి. అలాగే భోజనాన్ని త్వరగా ముగించడం వల్ల కూడా బరువు పెరగకుండా ఉంటారు.
రాత్రి పూట కొందరు ఆహారాన్ని, మద్యాన్ని అధికంగా తీసుకుంటారు. నిజానికి ఈ రెండు అలవాట్లు బరువును బాగా పెంచుతాయి. కనుక వీటిని మానేయాలి. అలాగే రాత్రి ఎట్టి పరిస్థితిలోనూ జంక్ ఫుడ్, స్వీట్లు, నూనె వస్తువులను తినరాదు. ఇవి కొవ్వుగా మారుతాయి. కనుక ఈ తప్పు చేయరాదు. ఇలా రోజూ రాత్రి పలు విధాలైన తప్పులను చేయకుండా ఉండడం వల్ల బరువు తగ్గుతారు. బరువు నియంత్రణలో ఉంటుంది.