శరీరంలో పేరుకొనే చెడు కొల్లెస్టరాల్ మరణాన్నిస్తుంది. అయితే, ఇది ఎపుడు, ఎలా చంపేస్తుందనేది ఒక సమస్యే. షుగర్ లేదా రక్తపోటు వంటివి లక్షణాలు చూపిస్తాయి. కాని ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది ప్రజలను మృత్యువాత పడేసే కొల్లెస్టరాల్ విషయంలో కనీసం ఎటువంటి సూచనలు కనపడవు. ఒక రక్త పరీక్ష చేయిస్తే అది బ్లడ్ సీరం లో 200 ఎంజి పర్ డిఎల్ వుంటే అపుడు మాత్రమే ఆందోళన పడేందుకు అవకాశం. కొల్లెస్టరాల్ అతి విలువైన మీ జీవితంలో సంవత్సరాల తరబడి మీకు తెలియకుండా హాని కలిగిస్తూంటుంది.
కొల్లెస్టరాల్ మీ శరీరంలోని కణాల బాహ్యపొరను నిర్మిస్తుంది. అది లేకుంటే మనం మరణిస్తాం. సెక్స్ హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. జీవప్రక్రియకు అవసరమైన కొవ్వు ఏర్పరుస్తుంది. ఇప్పటివరకు శరీరానికి మంచిగా వున్న కొల్లెస్టరాల్ చెడుగా మారితే……బ్లడ్ లో దాని స్ధాయి పెరిగితే ఒక మీకు అది శత్రువే. హై కొల్లెస్టరాల్ గల వ్యక్తి రక్తనాళాలు మూసుకుపోతాయి. గుండె పోట్లు, యాంజినా, ఇతర గుండె సంబంధిత వ్యాధులు వస్తాయి. మీ లివర్ రోజుకు 1,000 మి.గ్రా. కొల్లెస్టరాల్ తయారు చేస్తుంది.
మనం తినే పదార్ధాల ద్వారా 150 నుండి 200 మి. గ్రా.లోపలికి పోతుంది. ఇక బ్లడ్ సీరం లో 200 మి.గ్రా.డిఎల్ చేరితే సమస్య మొదలయిందే. అధిక బరువు అధిక కొల్లెస్టరాల్ కు దోవతీస్తుంది. కొల్లెస్టరాల్ నియంత్రణ – వెన్న, జున్ను, గుడ్డు సొన, మాంసం అవయవాలు (కిడ్నీ, లివర్ మొదలైనవి) తినకండి. వెన్నతీసిన పాలు తాగండి. నూనెలు వాడకం తగ్గించండి. శాకాహార తిండ్లు తినండి. ఎగ్ వైట్ మాత్రమే తినండి. వేపుడులు తినటం మానండి. తగిన శారీరక వ్యాయామం చేయండి. బరువు తగ్గండి. ఆల్కహాల్, పొగతాగటం మానండి. కొల్లెస్టరాల్ శరీరంలో అధికస్ధాయిలో చేరితే వైద్య సలహాలు తప్పక పొందాలి.