Facepack : మన శరీరంలో మిగతా భాగాలు అందంగా ఉన్నా లేకున్నా ముఖం మాత్రం అందంగా ఉండాలని చాలా మంది కోరుకుంటారు. కానీ ప్రస్తుత కాలంలో నల్ల మచ్చలు, మొటిమలు, జిడ్డు చర్మం వంటి అనేక సమస్యలు ముఖ అందాన్ని దెబ్బతీస్తున్నాయి. వీటి నుండి బయట పడడానికి అనేక రకాల సౌందర్య సాధనాలను వాడుతూ ఉంటారు. ముఖం అందంగా కనబడాలని ఎంతో ఖర్చు చేస్తూ ఉంటారు. ఫేషియల్స్ చేయించుకుంటూ ఉంటారు. ఈ ఫేషియల్స్ చేయించుకోవడానికి ఎక్కడికో వెళ్లాల్సిన పని లేదు. ఖర్చు చేయాల్సిన పని కూడా లేదు. సహజ సిద్ద పదార్థాలతో ముఖాన్ని అందంగా మార్చే 3 రకాల ఫేషియల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం మనం రోజ్ వాటర్ ను, పాలు, కందిపప్పు, పసుపును ఉపయోగించాల్సి ఉంటుంది.
ముందుగా ఒక గిన్నెలో నీటిని తీసుకోవాలి. అందులో కందిపప్పును వేసి రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజూ ఆ కందిపప్పును పేస్ట్ గా చేయాలి. తరువాత ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ కందిపప్పు పేస్ట్ ను, ఒక టేబుల్ స్పూన్ పాలను, ఒక టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ ను, కొద్దిగా పసుపును వేసి కలపాలి. తరువాత ముఖాన్ని శుభ్రంగా కడిగి ఈ మిశ్రమంతో ఫేస్ ఫ్యాక్ వేసుకోవాలి. 20 నిమిషాల తరువాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల 20నిమిషాల్లోనే ముఖం తెల్లగా మారుతుంది. బయటకు వెళ్లాలి అనుకున్నప్పుడు ఈ ఫేస్ ఫ్యాక్ ను వాడడం వల్ల అందరి దృష్టి మీ మీదే ఉంటుంది. అలాగే ఈ చిట్కాను తరచూ వాడడం వల్ల సమస్యలు తగ్గి ముఖం అందంగా కాంతివంతంగా మారుతుంది. ఇప్పుడు రెండో ఫేషియల్ ప్యాక్ గురించి తెలుసుకుందాం.
దీనికోసం మనం ముల్తానీ మట్టిని, టమాట రసాన్ని, పాలను, రోజు వాటర్ ను ఉపయోగించాల్సి ఉంటుంది. దీనిని తయారు చేసుకోవడానికి ఒక గిన్నెలో పైన తెలిపిన పదార్థాలను ఒక్కో టేబుల్ స్పూన్ చొప్పున తీసుకుని బాగా కలపాలి. ఈ పేస్ట్ చేత్తో కానీ, బ్రష్ తో కానీ ముఖానికి రాసుకుని ఆరే వరకు ఉంచాలి. తరువాత చల్లటి నీటితో కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం పైఉండే జిడ్డు తొలగిపోతుంది. ఆయిల్ స్కిన్ ఉన్న వారికి ఈ ఫ్యాక్ బాగా ఉపయోగపడుతుంది. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే ముఖం పైఉండే జిడ్డు పోవడంతో పాటు ముఖం కాంతివంతంగా తయారవుతుంది. ఇక మూడవ ఫేస్ ఫ్యాక్ గురించి తెలుసుకుందాం.
దీని కోసం మనం మైదా పిండిని, శనగపిండిని, బియ్యం పిండిని, నిమ్మరసాన్ని, పాలను ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక గిన్నెను తీసుకుని అందులోకి పైన తెలిపిన పదార్థాలను ఒక్కో టేబుల్ స్పూన్ చొప్పున తీసుకోవాలి. తరువాత ముఖాన్ని శుభ్రంగా కడుక్కుని ఈ పేస్ట్ ను ముఖానికి రాసుకోవాలి. ఆరిన తరువాత చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఈ ఫ్యాక్ ను వాడడం వల్ల చర్మం పై ఉండే మృతకణాలు తొలగిపోతాయి. వారానికి రెండుసార్లు ఈ చిట్కాను పాటించడం వల్ల ముఖం మెరిసిపోతుంది. ఈ ఫేస్ ఫ్యాక్ లను వాడడం వల్ల ముఖం అందంగా, కాంతివంతంగా మారుతుంది.