Gangavavili Aku : మనం ఆహారంగా తీసుకునే ఆకుకూరల్లో గంగవల్లి ఆకుకూర కూడా ఒకటి. దీనిని ఒక సూపర్ ఫుడ్ గా నిపుణులు చెబుతుంటారు. ఈ ఆకుకూరలో శరీరానికి కావల్సిన పోషకాలు ఎన్నో ఉన్నాయి. దీనిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. దీనిని గంగ వావిలి ఆకు అని ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తారు. గంగవల్లి ఆకులు చూడడానికి చాలా చిన్నగా దళసరిగా ఉంటాయి. అలాగే వీటిని పసుపు రంగు చిన్న చిన్న పువ్వులు కూడా పూస్తాయి. ఈ ఆకుకూరతో పప్పు, కూర వంటివి తయారు చేస్తూ ఉంటాం. అలాగే ఈ ఆకుకూరను సలాడ్ రూపంలో కూడా తీసుకోవచ్చు.
ఏ ఆకుకూరలోని ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఈ ఆకుకూరలో ఎక్కువగా ఉన్నట్టు పరిశోధనల్లో తేలింది. గుండె సంబంధిత సమస్యలు, పక్షవాతం, ఎ డి హెచ్ డి, ఆటిజం వంటి వాటితో పాటు పిల్లల్లో ఎదుగుదల సమస్యలను కూడా ఈ గంగవల్లి ఆకు నివారిస్తుంది. ఈ ఆకుకూరలో విటమిన్ ఎ, బి, సి, ఇ లతో పాటు మెగ్నీషియం, ఐరన్, మాంగనీస్, పొటాషియం, క్యాల్షియం, కార్బోహైడ్రేట్స్, ఆమైనో యాసిడ్ వంటి పోషకాలు ఎన్నో ఉన్నాయి. అంతేకాకుండా ఈ ఆకుకూరలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కనుక బరువు తగ్గే వారు కూడా ఈ ఆకుకూర చాలా మంచిది. ఈ గంగవల్లి ఆకుకూరను తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది.
దీనిని తీసుకోవడం వల్ల ఓరల్ క్యావిటీ క్యాన్సర్ ను రాకుండా నివారించుకోవచ్చని నిపుణులు సైతం చెబుతున్నారు. గంగవల్లి ఆకుకూరను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది. జుట్టు పొడవుగా పెరుగుతుంది. శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది. దీంతో గుండె సంబంధిత సమస్యల బారిన పడకుండా ఉంటాం. నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో, జ్ఞాపకశక్తిని పెంచడంలో కూడా ఈ ఆకుకూర మనకు సహాయపడుతుంది. గంగవల్లి ఆకుకూరను తీసుకోవడం వల్ల చర్మం పై ఉండే ముడతలు తొలగిపోతాయి. బీపీ నియంత్రణలో ఉంటుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి రోగాల బారిన, ఇన్ఫెక్షన్ ల బారిన పడకుండా ఉంటాం. ఎముకలు ధృడంగా తయారవుతాయి.
రక్తహీనత సమస్యతో బాధపడే వారు, మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడే వారు ఈ ఆకుకూరను తీసుకోవడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. శరీరంలోని వ్యర్థాలను, విష పదార్థాలను తొలగించే శక్తి కూడా ఆకుకూరకు ఉంది. ఈ గంగవల్లి ఆకుకూరలో పోషకాలు ఎక్కువ క్యాలరీలు తక్కువ. ఈ గంగవల్లి ఆకుకూరను కనీసం వారానికి ఒక్కసారైనా ఖచ్చితంగా తీసుకోవాలని తద్వారా మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.