Thotakura Benefits : మన శరీరానికి అవసరమైన పోషకాల్లో క్యాల్షియం కూడా ఒకటి. ఇది మనం తీసుకునే ఆహారం ద్వారా మన శరీరానికి లభిస్తుంది. కానీ ప్రస్తుత కాలంలో పోషకాలు కలిగిన కలిగిన ఆహారాన్ని తీసుకోవడం మానేసాము. దీంతో శరీరంలో క్యాల్షియం లోపించి ఎముకలు బలహీనంగా తయారవుతున్నాయి. ఈ కారణం చేత చిన్న చిన్న గాయాలకే ఎముకలు విరగడం, కీళ్ల నొప్పుల బారిన పడడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ సమస్యలన్నింటిని మనం ఒకే ఒక ఆకుకూరతో నయం చేసుకోవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. తోటకూర అత్యంత ఆరోగ్యకరమైనది. తోటకూర చాలా సులభంగా జీర్ణమవుతుంది. కంటి ఆరోగ్యానికి కూడా తోటకూర చాలా మంచిది. ఎదిగే పిల్లలకు తోటకూర చాలా బలవర్దకమైన ఆహారం.
ఒక కప్పు తోటకూర తినడం వల్ల మనం 5 కోడిగుడ్లు, 2 కప్పుల పాలు, 3 కమలాలు, 25 గ్రాముల మాంసం, 5 ఆపిల్స్ తీసుకున్నంత బలం. దీని బట్టి తోటకూరలోని పోషక విలువల గురించి మనం అర్థం చేసుకోవచ్చు. జీర్ణ శక్తిని మెరుగుపరచడంలో, రక్తహీనతను తగ్గించడంలో తోటకూర మనకు ఎంతగానో సహాయపడుతుంది. పాలు కొందరికి అలర్జీని కలిగిస్తాయి. అలాంటి వారు తోటకూరను తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత క్యాల్షియం లభిస్తుంది. షుగర్ వ్యాధి గ్రస్తులకు కూడా తోటకూర ఔషధంలా పని చేస్తుంది. ఉడికించిన తోటకూరతో తేనె కలిపి గోధుమ రొట్టెతో తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్, అజీర్తి, మలబద్దకం వంటి సమస్యలు తగ్గుతాయి. గుండె బలహీనంగా ఉన్న వారు, నరాల బలహీనతో బాధపడే వారు తోటకూరను తీసుకోవడం వల్ల చక్కటి ఫలితాలను పొందవచ్చు.
ఎముకల సంబంధిత సమస్యలతో బాధపడే వారు అర గ్లాస్ తోటకూర రసంలో 2 టీ స్పూన్ల అల్లం రసం, ఒక టీ స్పూన్ బ్రౌన్ షుగర్ కలిపి బాగా మరిగించాలి. తరువాత దీనిని వడకట్టి ఒక టీ స్పూన్ మోతాదులో 41 రోజుల పాటు తీసుకోవాలి. దీంతో ఎముకల సంబంధిత సమస్యలన్నీ దూరం అవుతాయి. దీంతో శరీరంలో క్యాల్షియం శాతం పెరుగుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఈ తోటకూర ఎంతగానో దోహదపడుతుంది. దీనిని తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలన్నీ అందడంతో పాటు బరువు కూడా తగ్గవచ్చు. కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె సంబంధిత సమస్యలను దూరం చేయడంలో తోటకూర ఎంతో తోడ్పడుతుంది. తోటకూరను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
బీపీ కూడా నియంత్రణలో ఉంటుంది. ఆరోగ్యానికి మాత్రమే సౌందర్యానికి కూడా తోటకూర ఎంతో తోడ్పడుతుంది. తోటకూర రసాన్ని తలకు పట్టించడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. తోటకూర ఆకులను పేస్ట్ గా చేసి తలకు పట్టించడం వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది. తోటకూర రసంలో పసుపును కలిపి ముఖానికి రాసుకోవడం వల్ల మొటిమలు, మచ్చలు వంటి చర్మ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. ఈ విధంగా తోటకూర మన ఎముకలతో పాటు మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని దీనిని తప్పకుండా రోజు వారి ఆహారంలో భాగంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.