Gas Pain Vs Heart Pain : ప్రస్తుత తరుణంలో చాలా మంది గ్యాస్ సమస్యతో అవస్థలు పడుతున్నారు. గ్యాస్ ట్రబుల్ వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. అధిక ఒత్తిడి, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, భోజనం వేళకు చేయకపోవడం, కారం, మసాలాలు అధికంగా ఉన్న ఆహారాలను తీసుకోవడం, అధికంగా బరువు ఉండడం, మద్యం సేవించడం, పొగ తాగడం.. వంటి అనేక కారణాల వల్ల గ్యాస్ సమస్య వస్తుంటుంది. గ్యాస్ సమస్య వస్తే.. కడుపు ఉబ్బరంగా ఉంటుంది. కడుపులో నొప్పి కూడా ఒక్కోసారి వస్తుంది. త్రేన్పులు వస్తాయి. శరీరం అంతా గ్యాస్ వచ్చినట్లు అనిపిస్తుంది. కొందరికి వెనుక నుంచి గ్యాస్ పోతుంది. అది కొన్ని సార్లు దుర్వాసనతో ఉంటుంది. అలాగే ఛాతిలో నొప్పి కూడా వస్తుంది.
అయితే గ్యాస్ ఉన్నవారికి అది ఏదో ఒక రూపంలో బయటకు వస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఛాతిలో నొప్పి, మంట కూడా వస్తాయి. దీంతో చాలా మంది అది గ్యాస్ నొప్పా.. గుండె నొప్పా.. అని ఖంగారు పడుతుంటారు. వెంటనే హాస్పిటల్‌కు పరుగులు పెడుతుంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉండడం మంచిదే. కానీ గ్యాస్ నొప్పి వచ్చినా దాన్ని గుండె నొప్పిగా భావించకూడదు. కొందరు గ్యాస్ నొప్పిని గుండె నొప్పి అని భావిస్తుంటారు. ఆనవసరంగా హైరానా పడుతుంటారు. అయితే అసలు గ్యాస్ నొప్పి, గుండె నొప్పి.. రెండింటినీ ఎలా గుర్తించాలి.. రెండింటికీ తేడాలు ఏమిటి..? ఏది ఏ నొప్పి అని ఎలా గుర్తు పట్టడం.. వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా గుండె నొప్పి 40 ఏళ్లు నిండిన వారికే వస్తుందని.. అంతకన్నా తక్కువ వయస్సు ఉన్నవారికి గుండె నొప్పి వచ్చే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. అలాంటి వారి సంఖ్య 100కు 3 లేదా 4 వరకు ఉంటుందన్నారు. కనుక తక్కువ వయస్సు ఉన్నవారు తమకు ఛాతిలో నొప్పి వస్తే అది గుండె నొప్పి అని ఖంగారు పడాల్సిన పనిలేదని అంటున్నారు. ఇక ఏ నొప్పి అయినా ఎవరైనా సరే అశ్రద్ధ చేయకూడదు. కనుక వెంటనే డాక్టర్ ను సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. ఇక గ్యాస్ నొప్పి అయితే సాధారణంగా యాసిడ్స్ పెరగడం వల్ల లేదా యాసిడ్ పైకి తన్నడం వల్ల వస్తుంది. దీని వల్ల అన్న వాహికపై అల్సర్లు ఏర్పడుతాయి. ఇది నొప్పిని, మంటను కలగజేస్తుంది. ఇది గుండె వెనుక ఉంటుంది కనుక దీనికి నొప్పి వస్తే.. అది గుండె నొప్పి అని అనుకుంటారు. కానీ అలా కాదు. గుండె నొప్పి వస్తే లక్షణాలు వేరే ఉంటాయి. అవేమిటంటే..
గుండె నొప్పి వస్తే ఛాతిపై పెద్ద బండరాయి పెట్టినట్లు నొప్పి వస్తుంది. అలా అనిపిస్తే దాన్ని గుండె నొప్పిగానే భావించాలి. సాధారణ నొప్పి అయితే దాన్ని గ్యాస్ నొప్పిగా భావించాలి. గుండె నొప్పి వస్తే ఛాతిలో పొడిచినట్లు ఉంటుంది. గ్యాస్ నొప్పి అలా కాదు. వస్తూ పోతూ ఉంటుంది. ఇక గుండె నొప్పి అయితే నాలుగు అడుగులు వేయగానే నొప్పి పెరుగుతుంది. వెంటనే స్పృహ కోల్పోతారు. అదే గ్యాస్ నొప్పి అయితే నాలుగు అడుగులు వేస్తే వెంటనే తగ్గిపోతుంది. గుండె నొప్పి వస్తే ఎడమ దవడ లేదా ఎడమ చేయి, భుజం లాగుతూ నొప్పిగా ఉంటాయి. అసలు కదిలించలేకుండా నొప్పి వస్తుంది. గ్యాస్ నొప్పి వస్తే అలా ఉండదు.
గుండె నొప్పి వచ్చిన వారి నాలుకపై ఎకోస్ప్రిన్ గోల్డ్ లేదా నైట్రోగ్లిజరిన్ టాబ్లెట్ పెడితే వెంటనే నొప్పి తగ్గుతుంది. అలా కాకుండా టాబ్లెట్ పెట్టినా నొప్పి తగ్గడం లేదు.. అంటే.. అది గ్యాస్ నొప్పి అని అనుమానించాలి. ఈ విధంగా మనం గ్యాస్ నొప్పి, గుండె నొప్పి మధ్య తేడాలను గమనించవచ్చు. ఈ రెండింటికీ తేడాలను తెలుసుకుంటే.. ఏది గ్యాస్ నొప్పి, ఏది గుండె నొప్పి అయిందీ మనకు ఇట్టే తెలిసిపోతుంది. ఒక వేళ గుండె నొప్పి అయితే వెంటనే డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకుని ఒక వేళ సమస్య ఉంటే చికిత్స తీసుకోవాలి. దీంతో గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. గుండెకు నష్టం కలగకుండా ముందుగానే జాగ్రత్త పడిన వారమవుతాము. గుండెకు సంబంధించిన పరీక్షలను ప్రతి వ్యక్తి కనీసం 6 నెలలకు ఒకసారి అయినా సరే చేయించుకోవాలి. అలాగే రోజూ 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం, పౌష్టికాహారం ముఖ్యంగా పండ్లను అధికంగా తీసుకోవడం, వేళకు భోజనం చేయడం.. ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం.. వంటి సూచనలు పాటిస్తే.. గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. దీంతోపాటు గ్యాస్ ట్రబుల్ కూడా రాకుండా ఉంటుంది.