Ganji Benefits : పూర్వం మన పెద్దలు అన్నం వండిన గంజి నీటిని పారబోసేవారు కాదు. గంజి నీటిని తాగేవారు. కానీ ప్రస్తుతం చాలా మంది గంజి నీటిని పారబోస్తున్నారు. వాస్తవానికి అలా చేయరాదు. ఎందుకంటే గంజిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. గంజిని పారబోయకుండా తాగాల్సి ఉంటుంది. గంజి నీళ్లు గోరు వెచ్చగా ఉన్నప్పుడు కాస్త ఉప్పు వేసి బాగా కలిపి తాగాలి. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేయాల్సిన పనిలేకుండా ఈ గంజిని తాగవచ్చు. లేదా బ్రేక్‌ఫాస్ట్ చేసిన తరువాత టీ, కాఫీలకు బదులుగా కూడా దీన్ని తాగవచ్చు. దీన్ని ముఖ్యంగా చలికాలంలో కచ్చితంగా తీసుకోవాలి. చలికాలంలో గంజిని తాగడం వల్ల ఎన్నో లాభాలు పొందవచ్చు. గంజి వల్ల ఎలాంటి ఉపయోగాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
చలికాలంలో మన శరీర ఉష్ణోగ్రత సహజంగానే తగ్గుతుంది. దీన్ని నియంత్రించడం కోసం శరీరం కష్టపడుతుంది. కానీ గంజిని తాగితే ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. శరీరం వెచ్చగా ఉంటుంది. శరీరంపై భారం పడదు. కనుక రోజూ గంజి తాగాలి. సాధారణంగా ఈ సీజన్‌లోనూ మనకు జ్వరాలు వస్తుంటాయి. అయితే గంజిని తాగడం వల్ల శరీరం వెచ్చగా ఉండడంతోపాటు వైరస్‌లు, బాక్టీరియాలు కూడా నశిస్తాయి. దీంతో జ్వరం త్వరగా తగ్గుతుంది. జ్వరం నుంచి కోలుకుంటారు. ఈ కాలంలో మన చర్మం బాగా పగులుతుంది. తెల్లగా మారుతుంది. కానీ గంజిని తాగితే చర్మం సురక్షితంగా ఉంటుంది. చర్మం పగలకుండా చూసుకోవచ్చు. కాబట్టి చలికాలంలో గంజిని తప్పక తీసుకోవాలి.
ఈ సీజన్‌లో మనకు జీర్ణ సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. అలాగే మలబద్దకం కూడా ఉంటుంది. కానీ గంజిని తాగితే ఈ సమస్యల నుంచి బయట పడవచ్చు. అలాగే గంజిని తాగితే ఇన్‌స్టంట్ ఎనర్జీ వస్తుంది. రోజంతా బాగా పనిచేసే వారు, తిరిగే వారు, జిమ్‌లు, వ్యాయామం చేసేవారు గంజిని తాగితే త్వరగా శక్తిని పుంజుకోవచ్చు. దీంతో నీరసం పోతుంది. చురుగ్గా పనిచేస్తారు. యాక్టివ్‌గా ఉంటారు. అలసట రాదు.
గంజిలో అనేక రకాల బి విటమిన్లు ఉంటాయి. ఇవి మనకు పోషణను అందిస్తాయి. గంజిని చిన్నారులు, గర్భిణీలు, వృద్ధులు ఎవరైనా సరే తాగవచ్చు. చిన్నారులకు గంజిని తాగిస్తుంటే వారిలో ఎదుగుదల సరిగ్గా ఉంటుంది. ఎదుగుదల లోపం, పోషకాహార లోపం వంటి సమస్యలు రావు. అలాగే విరేచనాలు, వాంతులు అవుతున్నప్పుడు గంజిని తాగితే త్వరగా కోలుకుంటారు. ఆయా సమస్యల నుంచి త్వరగా బయట పడవచ్చు. కనుక ఇకపై ఇంట్లో అన్నం వండితే గంజిని పారబోయకండి. దాన్ని రోజూ ఒక గ్లాస్ చొప్పున తాగితే ఎన్నో లాభాలను పొందవచ్చు.