Feet Whitening Remedy : మనలో కొందరికి ముఖం తెల్లగా ఉన్నప్పటికి పాదాలు నల్లగా ఉంటాయి. పాదాలు త్వరగా నల్లగా అవుతాయి. ఎండలో ఎక్కువగా తిరగడం, పాదాలపై దుమ్ము ధూళి చేరడం, చర్మం పై మృత కణాలు పేరుకుపోవడం వంటి కారణాల వల్ల పాదాలు నల్లగా మారుతాయి. దీంతో ముఖం ఒకలాగా పాదాలు ఒకలాగా కనిపిస్తాయి. చాలా మంది ముఖం మీద చూపించిన శ్రద్ధను పాదాలపై చూపించరు. సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వల్ల కూడా పాదాలు నల్లగా మారతాయి. ఒక చిన్న చిట్కాను ఉపయోగించి నల్లగా మారిన పాదాలను మనం తెల్లగా మార్చుకోవచ్చు. మన ఇంట్లోనే ఒక ప్యాక్ ను తయారు చేసుకుని వాడడం వల్ల నల్లగా ఉన్న పాదాలు తెల్లగా అవుతాయి.
ఈ ప్యాక్ ను తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. పాదాలను తెల్లగా మార్చే ఇంటి చిట్కాను ఎలా తయారు చేసుకోవాలి..తయారీకి కావల్సిన పదార్థాలే ఏమిటి.. అలాగే ఈ ప్యాక్ ను ఎలా వాడాలి అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ప్యాక్ ను తయారు చేసుకోవడానికి గానూ మనం శనగపిండిని,పెరుగును, నిమ్మరసాన్ని, మైసూర్ పప్పు పొడిని ఉపయోగించాల్సి ఉంటుంది. దీనికోసం మనం ఒక గిన్నెలో రెండు టీ స్పూన్ల శనగపిండిని తీసుకోవాలి. తరువాత అందులో రెండు టీ స్పూన్ల పెరుగును వేసి కలపాలి. తరువాత ఇందులో అర చెక్క నిమ్మరసాన్ని వేసుకోవాలి. చివరిగా ఇందులో ఒకటిన్నర టీ స్పూన్ మోతాదులో మైసూర్ పప్పు పొడిని వేసి అన్నీ కలిసేలా బాగా కలపాలి. ఈ మైసూర్ పప్పు పొడి మరీ మెత్తగా ఉండకుండ చూసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ప్యాక్ ను ఉపయోగించడానికి ముందు పాదాలను శుభ్రంగా కడుక్కోవాలి.
తరువాత చేత్తో లేదా బ్రష్ తో ఈ మిశ్రమాన్ని తీసుకుంటూ పాదాలకు మరీ పలుచగా కాకుండా మందంగా రాసుకోవాలి. ఇలా పాదాలకు రాసుకున్న మిశ్రమం పూర్తిగా ఆరిన తరువాత కొద్ది కొద్దిగా నీటితో తడి చేస్తూ సున్నితంగా మర్దనా చేస్తూ నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల చర్మం పై పేరుకుపోయిన మృతకణాలు, దుమ్ము ధూళి, మురికి ఎండ వల్ల ఏర్పడిన నలుపు పూర్తిగా తొలగిపోయి పాదాలు కాంతివంతంగా తయారవుతాయి. ఈ ప్యాక్ ను పాదాలకే కాకుండా చేతులు, కాళ్లు, ముఖం, మెడ వంటి భాగాలపై కూడా రాసుకోవచ్చు. అలాగే ఈ ప్యాక్ ను ఉపయోగించిన తరువాత ఆ రోజంతా సబ్బును ఉపయోగించకూడదు. అలాగే ప్యాక్ ను తొలగించిన తరువాత చర్మానికి మాయిశ్చరైజర్ కానీ కొబ్బరి నూనెను కానీ రాసుకోవాలి. ఈ ప్యాక్ ను వాడడం వల్ల చర్మం పై ఉండే ముడతలు తొలగిపోయి చర్మం బిగుతుగా కాంతివంతంగా తయారవుతుంది.