Digestion : మన శరీర ఆరోగ్యం మన జీర్ణవ్యవస్థపై ఆధారపడి ఉంటుంది. జీర్ణవ్యవస్థ చక్కగా ఉంటేనే మనం తిన్న ఆహారంలో ఉండే పోషకాలు మన శరీరానికి చక్కగా అందుతాయి. జీర్ణవ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్ల మనం తీసుకున్న ఆహారంలో పోషకాలు మన శరీరానికి చక్కగా అందవు. దీంతో మన శరీరంలో పోషకాహార లోపం తలెత్తుతుంది. పోషకాలు లోపించడం వల్ల ఆ ప్రభావం మన చర్మం, జుట్టు, కళ్లు, మెదడు వంటి ఇతర అవయవాలపై కూడా పడుతుంది. కనుక మనం మన జీర్ణవ్యవస్థను ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉంచుకోవాలి. జీర్ణవ్యవస్థ సరిగ్గా లేకపోతే మనం అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అజీర్తి, ఆకలిలేకపోవడం, గ్యాస్, మలబద్దకం, ఎసిడిటి, ఉబ్బసం, కడుపులో మంట, చర్మంపై మొటిమలు, నిద్రపట్టకపోవడం, ఫైల్స్, కీళ్ల నొప్పులు వంటి అనేక ఇతర అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది.
ఇటువంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండాలంటే మనం మన జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా అవసరం. కొన్ని రకాల ఆయుర్వేద చిట్కాలను వాడడం వల్ల మనం చాలా సులభంగా మన జీర్ణవ్యవస్థను చురకుగా, ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. జీర్ణవ్యవస్థ సక్రమంగా పని చేసేలా చేసే ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. జీర్ణవ్యవస్థ సక్రమంగా పని చేయని వారు ఈ చిట్కాలను వాడడం వల్ల మనం చక్కటి ఫలితాలను పొందవచ్చు. దీనికోసం ముందుగా ఒక కప్పుపెరుగును తీసుకోవాలి. తరువాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ పటిక బెల్లం పొడిని, అర టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, చిటికెడు నల్ల ఉప్పు వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న పెరుగును రోజూ భోజనం చేసిన తరువాత తినడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. జీర్ణాశయంలో మంచి బ్యాక్టీరియా శాతం పెరుగుతుంది. అలాగే భోజనం చేసిన సోంపు గింజలను తినడం వల్ల కూడా మనం మంచి ఫలితాలను సొంతం చేసుకోవచ్చు.
భోజనం తరువాత సోంపు గింజలను తినడం వల్ల మనం తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. భోజనం చేసిన తరువాత కడుపు ఉబ్బరంగా ఉన్నవారు సోంపు గింజలను తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే అజీర్తి సమస్యతో బాధపడే వారు భోజనానికి ముందు ఒక కప్పు నీళ్లల్లో ఒక టేబుల్ స్పూన్ అల్లం రసం, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి కలిపి తాగాలి. ఇలా చేయడం వల్ల మనం తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. అదే విధంగా రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ పాలల్లో పసుపు వేసి కలిపి తాగాలి. ఇలా చేయడం వల్ల నిద్ర చక్కగా పట్టడంతో పాటు మన కడుపు కూడా శుభ్రపడుతుంది.
ఈ చిట్కాలను పాటిస్తూనే కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి. భోజనం చేసేటప్పుడు ఆహారాన్ని బాగా నమిలి తినాలి. అలాగే నీటిని ఎక్కువగా తాగాలి. అదే విధంగా సమయానికి ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే జంక్ ఫుడ్ ను తక్కువగా తీసుకోవాలి. తాజా కూరగాయలను, పండ్లను, ఆకుకూరలను తీసుకోవాలి. ఈ చిట్కాలను పాటించడం వల్ల అజీర్తి, మలబద్దకం, గ్యాస్, ఎసిడిటి వంటి జీర్ణ సమస్యలన్నీ దూరం అవుతాయి. జీర్ణక్రియ సక్రమంగా, సాఫీగా సాగుతుంది. దీంతో మనం ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండవచ్చు.