Bread Pizza : మనకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లల్లో , రెస్టారెంట్ లలో లభించే పదార్థాల్లో పిజ్జా కూడా ఒకటి. పిజ్జా చాలా రుచిగా ఉంటుంది. వయసుతో సంబంధం లేకుండా అందరూ దీనిని ఎంతో ఇష్టంగా తింటారు. పిజ్జాను రకరకాల రుచుల్లో, రకరకాల పద్దతుల్లో తయారు చేస్తూ ఉంటారు. మనం సులభంగా తయారు చేసుకోదగిన పిజ్జా వెరైటీలలో బ్రెడ్ పిజ్జా కూడా ఒకటి. బ్రెడ్ తో చేసే పిజ్జా కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని కేవలం 5 నిమషాల్లోను తయారు చేసుకోవచ్చు. పిల్లలు కూడా దీనిని సులభంగా తయారు చేయవచ్చు. అలాగే ఎలాంటి ఒవెన్ లేకుండా దీనిని మనం తయారు చేసుకోవచ్చు. బ్రెడ్ పిజ్జాను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బ్రెడ్ పిజ్జా తయారీకి కావల్సిన పదార్థాలు..
సాండ్ విచ్ బ్రెడ్ స్లైసెస్ – 2, పిజ్జా సాస్ – ఒక టీ స్పూన్, మోజరెల్లా చీజ్ – 100 గ్రా., చిన్నగా తరిగిన రెడ్, గ్రీన్ క్యాప్సికం ముక్కలు – కొద్దిగా, చిల్లీ ప్లేక్స్ – కొద్దిగా, మిక్డ్స్ హెర్బ్స్ – పావు టీ స్పూన్, ముక్కలుగా చేసిన ఆలివ్స్ – కొద్దిగా, ముక్కలుగా చేసిన ఆల్పినో – కొద్దిగా.
బ్రెడ్ పిజ్జా తయారీ విధానం..
ముందుగా బ్రెడ్ స్లైసెస్ ను తీసుకోవాలి. తరువాత వాటిపై పిజ్జా సాస్ ను రాసుకోవాలి. తరువాత వాటిపై మోజరెల్లా చీజ్ ను తురిమి వేసుకోవాలి. తరువాత వీటిపై క్యాప్సికం ముక్కలను వేసుకోవాలి. తరువాత మరికొద్దిగా చీజ్ తురుమును వేసుకోవాలి. తరువాత వీటిపై చిల్లీ ప్లేక్స్ ను, మిక్డ్స్ చల్లుకోవాలి. తరువాత ఆలివ్స్ ను, ఆల్పినోస్ ను బ్రెడ్ పై అక్కడక్కడా ఉంచాలి. ఇప్పుడు కళాయిలో కొద్దిగా బటర్ వేసి వేడి చేయాలి. తరువాత ఇందులో ఒక బ్రెడ్ స్లైసెస్ ను మాత్రమే ఉంచి ఆవిరి బయటకు పోకుండా మూత పెట్టి 5 నుండి 6 నిమిషాల పాటు చిన్న మంటపై అలాగే ఉంచాలి. చీజ్ కరగగానే బ్రెడ్ స్లైసెస్ ను నెమ్మదిగా ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బ్రెడ్ పిజ్జా తయారవుతుంది. దీనిని టమాట కిచప్ తో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా ఇంట్లో ఎంతో రుచిగా బ్రెడ్ పిజ్జాను తయారు చేసుకుని తినవచ్చు. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.