ప్రస్తుత ఆధునిక యుగంలో కంప్యూటర్ల ఎదుట కూర్చుని పనిచేయడం ఎక్కువైపోయింది. అలాగే స్మార్ట్‌ఫోన్ల వాడకం కూడా పెరిగింది. దీంతో కంటి సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా కొందరికి కళ్లు పొడిగా మారుతూ.. దురదలు వస్తున్నాయి. అలాగే కళ్ల నుంచి నీరు కారడం, కళ్లు మంటలుగా అనిపించడం వంటి సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. అయితే కింద తెలిపిన పలు చిట్కాలను పాటిస్తే.. ఆయా కంటి సమస్యల నుంచి బయట పడవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటంటే…
* ఒక శుభ్రమైన వస్త్రాన్ని తీసుకుని దాన్ని గోరు వెచ్చని నీటిలో ముంచి కళ్లపై మర్దనా చేసినట్లు ప్రెస్ చేయాలి. దీంతో కళ్లు రిలాక్స్ అవుతాయి. అలాగే కళ్లలో ద్రవాలు పెరిగి కళ్లు పొడిగా మారడం, దురద పెట్టడం, మంటగా ఉండడం తగ్గుతాయి.
* కొద్దిగా కొబ్బరినూనె తీసుకుని అందులో కొంత దూదిని ముంచి ఆ దూదిని కను రెప్పలపై 15 నిమిషాలపాటు ఉంచాలి. దీంతో కళ్ల దురద, మంట నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే కళ్లు పొడిగా మారకుండా ఉంటాయి.
* కళ్లు మూసుకుని కను రెప్పలపై అలోవెరా జెల్‌ను ఉంచాలి. 10 నిమిషాల పాటు నిత్యం ఇలా చేస్తే కంటి సమస్యలు పోతాయి.
* రోజ్ వాటర్‌లో దూదిని ముంచి ఆ దూదిని కనురెప్పలపై పెట్టుకోవాలి. 10 నిమిషాల తరువాత దూదిని తీసి కళ్లను చల్లని నీటితో కడగాలి. తరచూ ఇలా చేస్తే కళ్ల దురదలు, మంట, పొడిగా మారడం వంటి సమస్యలు తగ్గుతాయి.
* ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉండే చేపలు, అవిసె గింజలు, వాల్‌నట్స్‌తోపాటు విటమిన్ ఎ ఎక్కువగా ఉండే పాలకూర, ఆపిల్స్, క్యారెట్లు తదితర పదార్థాలను నిత్యం తింటే కంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365