మనలో చాలా మందికి చెవి సంబంధ సమస్యలు అప్పుడప్పుడు వస్తుంటాయి. దీంతో చెవిలో ఒకటే హోరుమనే శబ్దం కొందరికి వినిపిస్తుంది. ఇక మరికొందరికైతే చెవి అంతర్భాగంలో ఇన్ఫెక్షన్ రావడం వల్ల చెవి సంబంధ వ్యాధులు వస్తాయి. ఈ క్రమంలో ఇయర్ బడ్స్‌ను చెవిలో పెడితే సమస్య తీవ్రత మరింత పెరుగుతుంది. అయితే ఈ సమస్యల నుంచి బయట పడాలంటే చెవిలో ఇయర్ బడ్స్ పెట్టాల్సిన పనిలేదు. దాంతో జరిగే లాభం కన్నా నష్టమే ఎక్కువ. మరి ఏం వాడాలంటే..?
వెల్లుల్లి రసం. అవును అదే. రెండు వెల్లుల్లి రెబ్బల్ని తీసుకుని వాటి నుంచి రసం తీయాలి. ఆ రసాన్ని ఒక టీస్పూన్ ఆలివ్ ఆయిల్‌తో కలపాలి. అనంతరం ఈ మిశ్రమంలో కొద్దిగా దూదిని వేయాలి. అలా కొంతసేప ఉన్నాక ఆ దూదిని తీసి దాన్ని సమస్య ఉన్న చెవిపై పెట్టి అందులో ఉండే మిశ్రమాన్ని చెవిలో పడేట్టుగా దూదిని పిండాలి. రెండు చుక్కలు చెవిలో పడగానే దూదిని తీసేయాలి. అలా ఒక నిమిషం పాటు ఉంటే చాలు, సమస్య తీవ్రత తగ్గుతుంది.
వెల్లుల్లి రసం, ఆలివ్ ఆయిల్‌లలో యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. కనుకనే అవి రెండింటినీ కలిపి మిశ్రమంగా చేసి చెవిలో వేస్తే దాంతో చెవుల్లో ఉండే బాక్టీరియా, క్రిములు నాశనమై చెవులు శుభ్రంగా మారుతాయి. చెవుల్లో చీము పట్టడం అనే సమస్య ఉన్నా ఇలా చేస్తే వెంటనే తగ్గుతుంది. అలా సమస్య తగ్గే వరకు కనీసం రోజుకు 2, 3 సార్లు అయినా ఇలా చేయాల్సి ఉంటుంది. దీంతో చెవుల్లో ఉండే ఇన్ఫెక్షన్లు పోతాయి. వాపు, నొప్పి తగ్గి చెవులు అంతర్గతంగా శుభ్రమవుతాయి.