Used Tea Powder : మనం సాధారణంగా ప్రతిరోజూ టీ పొడితో టీ ని తయారు చేసుకుని తాగుతూ ఉంటాం. టీ ని చాలా మంది ఇష్టంగా తాగుతారు. టీ ని తాగడం వల్ల శరీర బడలిక తగ్గుతుంది. ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు టీ ని తాగడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. అయితే మనం సాధారణంగా టీ ని తాగి టీ పౌడర్ ను పడేస్తూ ఉంటాం. కానీ టీ ని వడకట్టగా వచ్చిన టీ పౌడర్ ను మనం అనేక విధాలుగా ఉపయోగించుకోవచ్చు. టీ పౌడర్ ఉపయోగాలు తెలిస్తే కనుక మరోసారి మరెప్పుడు ఈ టీ పౌడర్ ను మనం పడేయము. వాడిన టీ పౌడర్ వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మనం సాధారణంగా పూరీలల్లోకి ఛోలే మసాలా కూరను తయారు చేసుకుని తింటూ ఉంటాం.
ఛోలే మసాలా కూర చాలా రుచిగా రావాలంటే మనం టీ పౌడర్ ను వాడాలి. టీ తయారు చేయగా వచ్చిన టీ పౌడర్ ను బాగా కడగాలి. తరువాత ఈ పౌడర్ ను నీటిలో మరోసారి బాగా ఉడికించి వడకట్టాలి. వడకట్టగా వచ్చిన నీటిని ఈ ఛోలే మసాలా కూరలో వేస్తే కూర చాలా రుచిగా వస్తుంది. అలాగే ఈ నీటిని వాడడం వల్ల కూరకు మంచి వాసన, రంగు కూడా వస్తుంది. అదే విధంగా ఉడికించిన టీ నీటితో ఫర్నీచర్ ను కూడా శుభ్రపరుచుకోవచ్చు. ఈ నీటితో ఫర్నీచర్ ను శుభ్రపరిస్తే ఫర్నీచర్ కొత్తదానిలా మెరుస్తుంది. అంతేకాకుండా టీ పౌడర్ ను ఉపయోగించడం వల్ల జుట్టుకు మంచి కాంతి చేకూరుతుంది. వాడేసిన టీ పౌడర్ ను మరలా నీటిలో ఉడికించాలి. ఈ నీటిని జుట్టుకు పట్టించి ఆరిన తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు కాంతివంతంగా తయారవుతుంది.
ఈ చిట్కాను వాడడం వల్ల కండీష్ నర్ ను వాడే అవసరమే ఉండదు. అలాగే వాడిన టీ పౌడర్ ను మనం ఎరువుగా కూడా ఉపయోగించవచ్చు. వాడిన టీ పౌడర్ ను ఆరబెట్టాలి. తరువాత దీనిని ఎరువుగా మొక్కలకు వేయాలి. ఇలా వేయడం వల్ల మొక్కలకు చక్కటి పోషకాలు అందుతాయి. మొక్కలు చక్కగా ఎదుగుతాయి. ఈ విధంగా టీ పౌడర్ మనకు అనేక రకాలుగా సహాయపడుతుంది. దీనిని ఉపయోగించడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.