Bones Health : నేటి తరుణంలో మనలో చాలా మంది కీళ్ల నొప్పులు, కీళ్ల వాపులు, నడిచేటప్పుడు కీళ్ల నుండి శబ్దం రావడం వంటి వివిధ రకాల కీళ్ల సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఈ సమస్యతో బాధపడుతున్నారు. పూర్వకాలంలో వయసు పైబడిన వారిలో మాత్రమే వచ్చే ఈ నొప్పులు నేటి తరుణంలో ప్రతి ఒక్కరిలో వస్తున్నాయి. అయితే చాలా మంది ఈ సమస్యల నుండి బయటపడడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా మూడు రకాల ఆహారాలను ప్రతిరోజూ తీసుకోవడం వల్ల మనం చాలా సులభంగా కీళ్ల సమస్యల నుండి బయటపడవచ్చు. కీళ్ల సమస్యలను, నొప్పులను, క్యాల్షియం లోపాన్ని తగ్గించే ఈ చిట్కాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ చిట్కాలను 20 సంవత్సరాల నుండి వృద్దుల వరకు ఎవరైనా పాటించవచ్చు. కీళ్ల నొప్పులను, వాపులను తగ్గించడంలో కాళోంజి విత్తనాలు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిని తీసుకోవడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. శరీరం ఆరోగ్యవంతంగా తయారవుతుంది. వీటిని తీసుకోవడం వల్ల గౌట్, ఆర్థరైటిస్ వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. అంతేకాకుండా షుగర్ ను అదుపులో ఉంచడంలో, వృద్దాప్య ఛాయలు మన దరి చేరకుండా చేయడంలో, గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో, జ్ఞాపకశక్తిని పెంచడంలో, కంటి చూపును మెరుగుపరచడంలో, జుట్టును ఒత్తుగా పెంచడంలో కూడా కాళోంజి విత్తనాలు మనకు సహాయపడతాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అధిక బరువు సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే వీటిని తీసుకోవడం వల్ల రక్తనాళాల్లో పేరుకుపోయిన అడ్డంకులు తొలగిపోతాయి.
కాళోంజి విత్తనాలతో పాటు మనం తీసుకోవాల్సిన మరో ఆహారం తెల్ల నువ్వులు. వీటిలో ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం, ఫైబర్ వంటి పోషకాలు ఎన్నో ఉన్నాయి. ఎముకలను ధృడంగా ఉంచడంలో, కీళ్ల నొప్పులను, వాపులను తగ్గించడంలో నువ్వులు ఎంతో సహాయపడతాయి. నువ్వులను ప్రతిరోజూ తీసుకోవడం వల్ల క్యాల్షియం లోపం తలెత్తకుండా ఉంటుంది. ఇక మనం తీసుకోవాల్సిన మరో పదార్థం అవిసె గింజలు. వీటిలో పోషకాలు ఎక్కువ మోతాదులో ఉంటాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, ఎముకలను ధృడంగా మార్చడంలో, కంటి చూపును మెరుగుపరచడంలో, చర్మం మరియు జుట్టును సంరక్షించడంలో ఇలా అనేక రకాలుగా అవిసె గింజలు మనకు ఉపయోగపడతాయి.
ఇప్పుడు ఈ మూడు దినుసులను ఎలా తీసుకోవాలి..అన్న వివరాలను తెలుసుకుందాం. ముందుగా ఒక గ్లాస్ నీటిలో ఒక టీ స్పూన్ కాళోంజి విత్తనాలు వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఈ నీటిని 4 నుండి 5 నిమిషాల పాటు వేడి చేసి ఆ తరువాత వడకట్టుకుని తాగాలి. ఇలా తీసుకోవడం వల్ల కీళ్ల సమస్యలు తగ్గడంతో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. అలాగే నువ్వులను మరియు అవిసె గింజలను దోరగా వేయించి తీసుకోవాలి. వేడి శరీరతత్వం ఉన్న వారు వీటిని పొడిగా చేసి పెరుగు లేదా మజ్జిగలో కలిపి తీసుకోవాలి. ఇలా ఈ మూడు పదార్థాలను తీసుకోవడం వల్ల ఎముకలు ధృడంగా, బలంగా తయారవుతాయి. కీళ్ల సమస్యలు తగ్గుతాయి. అలాగే శరీర ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కీళ్ల సమస్యలతో బాధపడే వారు ఈ మూడు పదార్థాలను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.