అప్పుడే పుట్టిన పిల్లలలో సుమారు 70% మందికి వారి చర్మంపై పసుపు రంగు వస్తుంది. దీనినే కామెర్లు అంటారు. పుట్టిన వారం రోజుల లోపల పిల్లలు ఈ వ్యాధితో బాధపడతారు. ఇది తాత్కాలికం. చికిత్సకు నయమవుతుంది. అయినప్పటికీ అది తీవ్రం కాకముందే దానిని నిరోధించవచ్చు.
బిలీరూబిన్ అనే పసుపు రంగు పదార్థం రక్తంలో అధికమై కామెర్లు కలిగిస్తుంది. రక్తం ఈ పదార్థాన్ని వ్యాపింపజేసి చర్మం కింద డిపాజిట్ చేస్తుంది. కనుక చర్మం పసుపు రంగుకు మారుతుంది. లివర్ వీరిలో బలహీనంగా ఉండటం చేత ఈ పదార్థాన్ని తొలగించలేదు. బిలీరూబిన్ పదార్థం మలం ద్వారా బయటకు రాకపోతే పేగులు దానిని పీల్చుకుని కామెర్లు కలిగిస్తాయి. నెలలు నిండకనే ముందుగా పుట్టడం బలహీనమైన లివర్, తల్లిపాలు మొదలైన కారణాలుగా కూడా బేబీలలో కామెర్లు వస్తాయి. కొంతమంది పిల్లల్లో శరీరం పచ్చగా మారిపోతుంది.
ముఖం, కాళ్ళు, చేతులు కూడా రంగు మారుతాయి. మూత్రం ముదురుగా వస్తుంది. ఇలాంటి అప్పుడు మాత్రమే వైద్యులు సీరియస్ గా తీసుకుంటారు. అలా అని వీరికి ప్రత్యేకంగా చికిత్స అంటూ ఏం ఉండదు. ఫోటోథేరపి లైట్స్ కింద ఎక్కువ రోజులు పెట్టి గమనిస్తారు. రెండు వారాలకు మించి ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం చాలా ప్రమాదం. అప్పుడు ప్రత్యేక చికిత్సలు చేయాల్సి ఉంటుంది. పిల్లలకు కామెర్లు ప్రాణాంతకంగా మారే అవకాశం ఎప్పుడు ఉంటుందంటే, తల్లి బ్లడ్ గ్రూప్ నెగిటివ్ ఉండి, బిడ్డది పాజిటివ్ ఉన్నప్పుడు, ఆ బిడ్డకు కామెర్లు తీవ్రస్థాయిలో వచ్చే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు.