Pulla Upma : పుల్ల ఉప్మా.. బియ్యం రవ్వతో చేసే ఈ ఉప్మా చాలా రుచిగా ఉంటుంది. ఇది చూడడానికి పులిహోరలా కనిపిస్తుంది. పూర్వకాలంలో ఈ పుల్ల ఉప్మాను ఎక్కువగా తయారు చేసే వారు. ఈ ఉప్మా చాలా రుచిగా ఉంటుంది. అల్పాహారంగా తినడానికి ఈ ఉప్మా చాలా చక్కగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభ. రుచిగా, కమ్మగా ఉండే ఈ పుల్ల ఉప్మాను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పుల్ల ఉప్మా తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం రవ్వ – ఒక కప్పు, నూనె – 3 టేబుల్ స్పూన్స్, పల్లీలు – 3 టేబుల్ స్పూన్స్, ఆవాలు – ఒక టీ స్పూన్, మినపప్పు – ఒక టీ స్పూన్, శనగపప్పు – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 2, జీలకర్ర – ఒక టీ స్పూన్, దంచిన మిరియాల పొడి – అర టీ స్పూన్, నానబెట్టిన చింతపండు – నిమ్మకాయంత, ఉప్పు – తగినంత, పసుపు -అర టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ.
పుల్ల ఉప్మా తయారీ విధానం..
ముందుగా చింతపండు నుండి 3 కప్పుల చింతపండు రసాన్ని తీసుకోవాలి. తరువాత కళాయిలో బియ్యం రవ్వ వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పల్లీలు వేసి వేయించాలి. పల్లీలు చక్కగా వేగిన తరువాత ఆవాలు వేసి వేయించాలి. తరువాత మినపప్పు, శనగపప్పు వేసి వేయించాలి. తరువాత ఎండుమిర్చి, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత మిరియాల పొడి వేసి కలపాలి. తరువాత చింతపండు రసం, ఉప్పు, పసుపు, కరివేపాకు వేసి కలపాలి. చింతపండు రసం మరిగిన తరువాత బియ్యం రవ్వ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి.
తరువాత దీనిని మధ్యస్థ మంటపై మెత్తగా ఉడికించుకోవాలి. రవ్వ మెత్తగా ఉడికిన తరువాత మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసి పది నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తరువాత మూత తీసి సర్వ్ చేసుకోవాలి. ఈ ఉప్మా వేడి మీద ముద్దగా ఉన్నా ఆరే కొద్ది పొడిగా అవుతుంది. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పుల్ల ఉప్మా తయారవుతుంది. దీనిని ఆవకాయతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా ఉదయం అల్పాహారంగా లేదా స్నాక్స్ గా కూడా ఈ ఉప్మాను తయారు చేసుకుని తినవచ్చు. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.