Special Chicken Fry : చికెన్ తో మనం రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. చికెన్ తో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. మాంసాహార ప్రియులు చికెన్ ను ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. చికెన్ తో చేసే రుచికరమైన వంటకాల్లో చికెన్ వేపుడు కూడా ఒకటి. చికెన్ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని నేరుగా తినేస్తూ ఉంటారు. ఈ వేపుడును ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా చేసే చికెన్ వేపుడు కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ వేపుడును ఎవరైనా చాలా రుచిగా చేయవచ్చు. మరింత రుచిగా, సులభంగా చికెన్ వేపుడును ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చికెన్ వేపుడు తయారీకి కావల్సిన పదార్థాలు..
బటర్ – 3 టేబుల్ స్పూన్స్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, చిన్నగా తరిగిన పెద్ద టమాట – 1, కసూరి మెంతి – ఒక టీ స్పూన్.
మ్యారినేషన్ కు కావల్సిన పదార్థాలు..
చికెన్ – అరకిలో, ధనియాలు – ఒక టేబుల్ స్పూన్, మిరియాలు – ఒక టీ స్పూన్, కాశ్మీరి చిల్లీ – 5, జీలకర్ర – అర టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టీ స్పూన్స్, గరం మసాలా – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, పసుపు – అర టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్.
చికెన్ వేపుడు తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో చికెన్ ను తీసుకుని శుభ్రంగా కడగాలి.తరువాత జార్ లో ధనియాలు, మిరియాలు, కాశ్మీరి చిల్లీ, జీలకర్ర వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. తరువాత ఈ పొడిని చికెన్ లో వేసుకోవాలి. తరువాత మిగిలిన పదార్థాలన్నీ కూడా వేసి బాగా కలుపుకోవాలి. తరువాత ఈ చికెన్ ను ఒక గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. తరువాత కళాయిలో బటర్ వేసి వేడి చేయాలి. బటర్ వేడయ్యాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ ను వేసి పది నిమిషాల పాటు కలుపుతూ వేయించాలి. తరువాత టమాట ముక్కలు, పచ్చిమిర్చి వేసి కలపాలి.
ఇప్పుడు కళాయిపై మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ ను వేయించాలి. ఒక వేళ చికెన్ పొడిగా అయితే కొద్దిగా నీటిని చల్లుకోవాలి. ఇలా 15 నిమిషాల పాటు వేయించిన తరువాత కసూరిమెంతిని వేసి కలపాలి. దీనిని మరో నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ వేపుడు తయారవుతుంది. దీనిని సైడ్ డిష్ గా తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈవిధంగా చేసిన చికెన్ వేపుడును అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.