Papaya : మనం ఆహారంగా తీసుకునే వివిధ రకాల పండ్లల్లో బొప్పాయి పండు కూడా ఒకటి. బొప్పాయి పండు మనకు దాదాపు అన్ని కాలాల్లో లభిస్తూ ఉంటుంది. అలాగే చాలా మంది ఇండ్లల్లో బొప్పాయి చెట్టును పెంచుకుంటూ ఉంటారు. అనేక రకాల ఇతర పండ్ల వలె బొప్పాయి పండు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే చాలా మంది ఈ పండును తినడానికి ఇష్టపడరు. రుచిగా ఉన్నప్పటికి దీనిని చాలా మంది ఇష్టంగా తినరు. అయితే నిపుణులు మాత్రం బొప్పాయి పండును కూడా తప్పకుండా ఆహారంగా తీసుకోవాలని చెబుతున్నారు. ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా దీనిని తీసుకోవడం వల్ల క్యాన్సర్ బారిన పడే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
బొప్పాయి పండులో ఉండే లైకోపిన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గించడంలో సహాయపడుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా చర్మ ఆరోగ్యాన్ని కాపాడడంలో, జీర్ణశక్తిని మెరుగుపరచడంలో, శరీరానికి కావల్సిన పోషకాలను అందించడంలో ఇలా అనేక రకాలుగా బొప్పాయి పండు మనకు సహాయపడుతుంది. బొప్పాయి పండులో ఉండే పోషకాలు, అలాగే దీనిని తీసుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మధ్యస్థంగా ఉండే బొప్పాయి పండులో 152 గ్రాముల పోషకాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
దీనిలో 60 క్యాలరీల శక్తి, 15 గ్రాముల కార్బోహైడ్రేట్స్, 3 గ్రాముల ఫైబర్, 1 గ్రాము ప్రోటీన్, 157 శాతం విటమిన్ సి, 33 శాతం విటమిన్ ఎ, 14 శాతం ఫోలేట్, 11 శాతం పొటాషియం వంటి పోషకాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. బొప్పాయి పండును తీసుకోవడం వల్ల విటమిన్ ఎ, విటమిన్, విటమిన్ బి9 ( ఫోలేట్), పొటాషియం వంటి పోషకాలు శరీరానికి అందుతాయి. దీనిలో ఉండే పపైన్ అనే ఎంజైమ్ జీర్ణశక్తిని మెరుగుపరిచి మలబద్దకాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే బొప్పాయి పండును తీసుకోవడం వల్ల ఆక్సిడేటివ్ ఒత్తిడితో పాటు శరీరంలో ఇన్ ప్లామేషన్ కూడా తగ్గుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని మెరుగుపరచడంలో, కంటి చూపును పెంచడంలో, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా బొప్పాయి పండు మనకు దోహదపడుతుంది. అంతేకాకుండా బొప్పాయి పండును తీసుకోవడం వల్ల మనం చాలా సులభంగా బరువు కూడా తగ్గవచ్చు.
ఈ విధంగా బొప్పాయి పండు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని దీనిని కూడా తప్పకుండా ఇతర పండ్ల వలె ఆహారంలో భాగంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికి గర్భిణీ స్త్రీలు దీనిని తీసుకోకపోవడమే మంచిదని వారు చెబుతున్నారు. అలాగే షుగర్ వ్యాధి గ్రస్తులు, ఇతర అనారోగ్య సమస్యలకు మందులు వాడే వారు దీనిని వైద్యులను సంప్రదించి తీసుకోవాలని వారు చెబుతున్నారు. అయితే బొప్పాయి పండులో ఉండే పోషకాలను చక్కగా పొందాలంటే పండిన మరియు పురుగు మందులు వాడని బొప్పాయి పండును మాత్రమే తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.