Java Plum Juice : నేరేడు పండ్లు మనకు అధికంగా లభించే సీజన్ ఇది. ఇతర సీజన్లలో ఈ పండ్లు లభించవు. కానీ దీంతో తయారు చేసిన జ్యూస్‌ను విక్రయిస్తారు. కానీ సీజన్‌లో లభించే పండ్లను తింటేనే మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఈ క్రమంలోనే నేరేడు పండ్లను చాలా మంది ఇష్టంగా తింటుంటారు. అయితే ఈ పండ్లతో ఎంతో రుచిగా ఉండే జ్యూస్‌ను కూడా తయారు చేయవచ్చు. దీన్ని చేయడం కూడా సులభమే. నేరేడు పండ్లతో జ్యూస్‌ను తయారు చేసుకుని చల్ల చల్లగా తాగవచ్చు. దీంతో పోషకాలు, శక్తి రెండూ లభిస్తాయి. అలాగే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఇక నేరేడు పండ్లతో జ్యూస్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
నేరేడు పండ్ల జ్యూస్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నేరేడు పండ్లు – విత్తనాలు తీసినవి 2 కప్పులు, నీళ్లు – 4 కప్పులు, చక్కెర – 2 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం – 1 టేబుల్ స్పూన్.
నేరేడు పండ్ల జ్యూస్‌ను తయారు చేసే విధానం..
ముందుగా నేరేడు పండ్లను శుభ్రంగా కడగాలి. తరువాత వాటిల్లో ఉండే విత్తనాలను తీసేసి గుజ్జు మాత్రం సేకరించాలి. దీన్ని మిక్సీ లేదా ఫుడ్ ప్రాసెసర్‌లో వేసి స్మూత్‌గా వచ్చే వరకు బ్లెండ్ చేయాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని వడకట్టుకోవాలి. తరువాత అందులో నీళ్లు, చక్కెర కలపాలి. అలాగే అవసరం అనుకుంటే నిమ్మరసం కలుపుకోవచ్చు. ఇలా అన్నింటినీ వేసి కలిపితే ఎంతో రుచిగా ఉండే నేరేడు పండ్ల జ్యూస్ రెడీ అవుతుంది. అయితే ఇది చల్లగా కావాలనుకుంటే ఫ్రిజ్‌లో పెట్టవచ్చు. లేదా చల్లని నీళ్లు, ఐస్ క్యూబ్స్‌ను ఉపయోగించవచ్చు. దీంతో ఎంతో రుచిగా.. చల్లగా ఉండే నేరేడు పండ్ల జ్యూస్‌ను ఆస్వాదించవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. అందరూ ఇష్టంగా తాగుతారు.