Brinjal Tomato Gravy Curry : వంకాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న సంగతి మనకు తెలిసిందే. మనం ఆహారంలో భాగంగా తరచూ వంకాయలను తీసుకుంటూ ఉంటాం. వీటితో రకరకాల రుచికరమైన వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాము. వంకకాయలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో వంకాయ టమాట కర్రీ కూడా ఒకటి. ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా తక్కువ సమయంలో చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. బ్యాచిలర్స్, వంటరాని వారు కూడా దీనిని సులభంగా తయారు చేసుకోవచ్చు. వంకాయ టమాట కర్రీని మరింత రుచిగా ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వంకాయ టమాట గ్రేవీ కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 3 టీ స్పూన్ప్,తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, తరిగిన పెద్ద ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 4, కరివేపాకు – ఒక రెమ్మ, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, తరిగిన వంకాయలు – అరకిలో, పసుపు – అర టీ స్పూన్, తరిగిన టమాటాలు – 4 ( మధ్యస్థంగా ఉన్నవి), ఉప్పు – తగినంత,కారం – ఒక టీ స్పూన్ లేదా తగినంత, ధనియాల పొడి – అర టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
వంకాయ టమాట గ్రేవీ కర్రీ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరువాత కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిని పచ్చి వాసన పోయే వరకు వేయించిన తరువాత వంకాయ ముక్కలు, పసుపు వేసి కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి 2 నిమిషాల పాటు వేయించాలి. తరువాత టమాట ముక్కలు, ఉప్పు వేసి కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి టమాట ముక్కలు మెత్తబడే వరకు వేయించాలి. టమాట ముక్కలు మెత్తబడిన తరువాత కారం, ధనియాల పొడి వేసి కలపాలి. దీనిని మరో నిమిషం పాటు ఉడికించిన తరువాత కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వంకాయ టమాట గ్రేవీ కర్రీ తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా చేసిన టమాట వంకాయ కర్రీని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.