Gas Problem : మనల్ని వేధించే జీర్ణ సంబంధిత సమస్యల్లో గ్యాస్ కూడా ఒకటి. ఈ సమస్య కారణంగా మనలో చాలా మంది బాధపడుతూ ఉంటారు. గ్యాస్ కారణంగా పుల్లటి త్రేన్పులు, కడుపులో నొప్పి, కడుపులో అసౌకర్యంగా ఉండడం వంటి ఇతర సమస్యలు కూడా తలెత్తుతూ ఉంటాయి. ఈ సమస్య నుండి బయటపడడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే కొన్ని చక్కటి చిట్కాలను వాడడం వల్ల మనం చాలా సులభంగా ఈ సమస్య నుండి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. గ్యాస్ సమస్యతో బాధపడే వారు ఎప్పుడూ మలం ప్రేగును శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రేగులో మలం నిల్వ ఉండడం వల్ల మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వదు. దాని వల్ల ప్రేగుల్లో ఆహారం నిల్వ ఉండి గ్యాస్ ఎక్కువగా తయారవుతుంది.
కనుక గ్యాస్య సమస్యతో బాధపడే వారు రోజూ ఉదయం గోరు వెచ్చని నీటిని లీటర్ నుండి లీటర్నర మోతాదులో తాగాలి. ఇలా తాగడం వల్ల మలబద్దకం సమస్య ఉండదు. మలం ప్రేగు శుభ్రపడుతుంది. అలాగే భోజనం చేసే సమయంలో, ఆహారం తీసుకునే సమయంలో నీటిని తాగకూడదు. నీటిని తాగడం వల్ల ఆహారాన్ని జీర్ణం చేసే జీర్ణరసాలు పలుచబడి ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వదు. ఆహారం జీర్ణం అవ్వకపోవడం వల్ల అవి పులిసి గ్యాస్ ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి. కనుక తినే సమయంలో నీటిని తాగకూడదు. భోజనం చేసిన రెండు గంటల తరువాత మాత్రమే నీటిని తాగాలి. ఇలా తాగడం వల్ల మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమయ్యి గ్యాస్ ఉత్పత్తి కాకుండా ఉంటుంది. అదే విధంగా రోజుకు మూడుసార్లు మాత్రమే ఆహారాన్ని తీసుకోవాలి. తరచూ ఏదో ఒకటి తింటూ ఉండకూడదు. ఇలా తీసుకోవడం వల్ల ఆహారం సరిగ్గా జీర్ణమవ్వదు.
ఆహారం నిల్వ ఉండి గ్యాస్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. కనుక రోజూ మూడు పూటలా మాత్రమే ఆహారాన్ని తీసుకోవాలి. మధ్యలో ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు. తీవ్రమైన గ్యాస్ సమస్యతో బాధపడే వారు ఉదయం, సాయంత్రం రెండు పూటలా తియ్యటి పండ్లను తిని మధ్యాహ్నం ఒక పూట మాత్రమే భోజనం చేయాలి. ఇలా పది రోజుల పాటు చేయడం వల్ల గ్యాస్ సమస్య త్వరగా తగ్గు ముఖం పడుతుందని వారు చెబుతున్నారు. అలాగే సాయంత్రం తీసుకునే ఆహారాన్ని ఏడు గంటల లోపే తీసుకోవాలి. రాత్రంతా పొట్టను, ప్రేగులను ఖాళీగా ఉంచాలి. ఇలా చేయడం వల్ల గ్యాస్ సమస్య తగ్గుతుంది. ఈ విధంగా ఈ నియమాలను పాటిచండం వల్ల గ్యాస్ సమస్య తగ్గడంతో పాటు మన దరి చేరకుండా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.