Fridge : మనలో చాలా మంది వారానికి సరిపడా కూరగాయలను, పండ్లను ఒకేసారి కొనుగోలు చేస్తూ ఉంటాము. వీటిని ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేసుకుని వారమంతా ఉపయోగించుకుంటూ ఉంటాము. ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేసుకోవడం వల్ల కూరగాయలు, పండ్లు పాడవకుండా తాజాగా ఉంటాయి. ఇది మనందరికి తెలిసిందే. అయితే కొన్ని పదార్థాలను, ఆహారాలను ఫ్రిజ్ లో ఉంచినప్పటికి అవి తాజాగా ఉండవు. ఇలా వీటిని ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేయడం వల్ల ఆరోగ్యానికి హాని కలిగించేవిగా మారతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఫ్రిజ్ లో ఉంచకూడని కూరగాయలు ఏమిటి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మనలో కొందరు బంగాళాదుంపలు బయట ఉంటే కుళ్లిపోతాయన్న ఉద్దేశ్యంతో వాటిని కూడా ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేస్తూ ఉంటారు.
అయితే బంగాళాదుంపలను అస్సలు ఫ్రిజ్ లో ఉంచకూడదు. ఫ్రిజ్ లో ఉంచడం వల్ల వీటిలో ఉండే పిండి పదార్థాలు చక్కెరగా మారతాయి. ఫ్రిజ్ లో ఉంచిన బంగాళాదుంపలను వండుకుని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు మరింత పెరుగుతాయి. కనుక వీటిని గాలి తగిలేలా బయటనే ఉంచాలి. ఇక అదే విధంగా మనం టమాటాలను కూడా ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేస్తూ ఉంటాము. మనం టమాటాలు ఫ్రిజ్ లో ఉంచడం వల్ల తాజాగా ఉంటాయి అనుకుంటాము కానీ ఫ్రిజ్ లో ఉండే చల్లటి వాతావరణానికి టమాటాలు త్వరగా చెడిపోతాయి. కనుక వీటిని కూడా బయటే ఉంచి నిల్వ చేసుకోవాలి.
అలాగే కొందరు ఎక్కువకాలం పాటు తాజాగా ఉండాలని ఇతర పండ్లతో పాటు అరటి పండ్లను కూడా ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేస్తూ ఉంటారు. కానీ అరటి పండ్లను ఫ్రిజ్ లో ఉంచకూడదు. ఫ్రిజ్ లో ఉంచడం వల్ల అరటి పండ్లు త్వరగా నల్లగా మారి పాడవుతాయి. కనుక అరటి పండ్లను కూడా బయటే ఉంచి నిల్వ చేసుకోవడం మంచిది. అలాగే తేనెను కూడా ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేస్తూ ఉంటారు. బయట ఉంచితే పాడవుతుందని కొందరు తేనెను ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేస్తూ ఉంటారు. కానీ తేనెను ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేయడం వల్లనే అది పాడవుతుంది. అలాగే రుచి తగ్గడంతో పాటు ఆరోగ్యానికి కూడా హాని కలుగుతుంది. తేనె ఎప్పటికి పాడవదు కనుక దానిని బయటే ఉంచడం మంచిది. అలాగే మనం కీరదోసకాయలను కూడా ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేస్తూ ఉంటాము.
కానీ కీరదోసలను ఫ్రిజ్ లో ఉంచకూడదు. ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేసుకోవడం వల్ల కీరదోసలు నీరుగా మారి క్రమంగా పాడవుతాయి. అలాగే కొత్తిమీర, పార్ల్సీ, పుదీనా వంటి వాటిని కూడా ఫ్రిజ్ లో ఉంచకూడదు. వీటిని ఫ్రిజ్ లో ఉంచడం వల్ల త్వరగా చెడిపోతాయి. కొత్తిమీర కట్టను, పార్ల్సీ వంటి వాటిని పూల మాదిరి ఒక కప్పు నీటిలో వేసి ఉంచాలి. అలాగే ఒక ప్లాస్టిక్ బ్యాగ్ ను గాలి తగిలేలా వదులుగా కట్టి ఉంచాలి. ఇలా చేయడం వల్ల కొత్తిమీర వంటివి ఎక్కువ కాలం పాటు తాజాగా ఉంటాయి.