చలికాలంలో సహజంగానే సూప్‌లను అధికంగా తాగుతుంటారు. కానీ ఏ కాలంలో అయినా సరే రోజూ టమాటా సూప్‌ను సేవించవచ్చు. ఈ సూప్‌కు కాలాలతో పనిలేదు. ప్రతి సీజన్‌లోనూ ఇది మనకు భిన్నరకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. రోజూ ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌తో కలిపి టమాటా సూప్‌ను తీసుకోవచ్చు. దీంతో మనసుకు ఉల్లాసం కలగడమే కాదు, దగ్గు, జలుబు వంటి శ్వాస కోశ సమస్యలు మాయమవుతాయి. శరీరానికి పోషకాలు కూడా లభిస్తాయి. ఇంకా ఎన్నో రకాల లాభాలు ఉంటాయి. ఈ క్రమంలో టమాటా సూప్‌ను రోజూ తాగడం వల్ల మనకు ఎలాంటి ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ కాలంలో ఎవరికైనా రోగ నిరోధక శక్తి కొంచెం తక్కువగానే ఉంటుంది. బాక్టీరియా, వైరస్ ఇన్‌ఫెక్షన్లు వర్షాకాలంలోనే కాదు, ఇప్పుడు కూడా వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ప్రధానంగా గాలి ద్వారా అవి ఒకరినుంచి మరొకరికి వ్యాపించవచ్చు. అయితే నిత్యం ఉదయాన్నే ఒక కప్పు టమాటా సూప్ తాగితే అలాంటి ఇన్‌ఫెక్షన్లకు చెక్ పెట్టవచ్చు. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నందున టమాటా సూప్ తాగితే శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ముందు చెప్పినట్టుగా జలుబు, దగ్గు వంటి సమస్యలు కూడా పోతాయి. టమాటాల్లో విటమిన్ కె, కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల ఎముకలకు ఎంతగానో మంచిది. ఎముకలు విరిగి అతుక్కుంటున్న వారికి, కీళ్ల నొప్పులు ఉన్నవారికి టమాటా సూప్ ఎంతగానో ఉపయోగపడుతుంది. నిత్యం ఒక కప్పు సూప్ తాగితే ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
విటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల టమాటా సూప్ తాగితే రక్త నాళాల్లో పేరుకుపోయిన అడ్డంకులు తొలగుతాయి. రక్త సరఫరా మెరుగుపడుతుంది. రక్తహీనత ఉన్నవారు టమాటా సూప్‌ను తాగితే మంచిది. చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది. దీంతో గుండె సంబంధ సమస్యలు రావు. ఎదిగే పిల్లలకు నిత్యం టమాటా సూప్‌ను ఇస్తే దాంతో రోజూ ఉత్తేజంగా ఉంటారు. చదువుల్లో రాణిస్తారు. మానసిక ఆరోగ్యం మెరుగు పడుతుంది. పొటాషియం ఎక్కువగా ఉన్నందువల్ల నాడీ సంబంధ సమస్యలు పోతాయి. టమాటా సూప్‌ను తాగడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. ఇది అధిక బరువు ఉన్న వారికి ఎంతగానో మేలు చేసే అంశం.
లైకోపీన్, కెరోటినాయిడ్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల పలు రకాల క్యాన్సర్లు రావు. క్యాన్సర్ కణతులు కూడా వృద్ధి చెందవు. ప్రధానంగా వక్షోజ క్యాన్సర్, ప్రోస్టేట్, కోలన్ క్యాన్సర్ వంటివి ఉన్నవారు టమాటా సూప్‌ను తాగడం మంచిది. 2 వారాల పాటు టమాటా సూప్‌ను రోజూ తాగితే దాంతో మగవారిలో వీర్య వృద్ధి అవుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. లైకోపీన్ వల్లే ఇది సాధ్యమవుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. టమాటాల్లో క్రోమియం ఎక్కువగా ఉంటుంది. ఇది డయాబెటిస్ ఉన్నవారికి ఎంతగానో మేలు చేస్తుంది. వారి రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులోకి వస్తాయి. కనుక మధుమేహం ఉన్న వారు టమాటా సూప్‌ను రోజూ తాగడం మంచిది. అయితే సోడియం పదార్థం ఎక్కువగా ఉన్నందున నిత్యం ఒక కప్పు వరకు మాత్రమే టమాటాలను తీసుకోవాలి. అది దాటితే దాంతో శరీరంలో సోడియం పెరిగి తద్వారా కిడ్నీలు డ్యామేజ్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది.