Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home చిట్కాలు

మూత్రంలో మంటగా అనిపిస్తుంటే.. ఆయుర్వేద చిట్కాలు..!

Admin by Admin
July 12, 2021
in చిట్కాలు
Share on FacebookShare on Twitter

ఆహారంలో పులుపు పదార్థాలు, ఊరగాయలు తదితర ఆమ్ల గుణాలు కలిగిన పదార్థాలను ఎక్కువగా తినేవారికి సహజంగానే మూత్రంలో ఆమ్లత్వం పెరిగి మంటగా అనిపిస్తుంది. దీన్ని డిజూరియా అంటారు. మూత్రంలో బాక్టీరియా దోషం వల్ల, సుఖ వ్యాధుల వల్ల కూడా ఈ మంట వస్తుంటుంది. మూత్ర పరీక్ష, రక్తపరీక్షలు చేస్తేనే ఈ సమస్య ఎందుకు వచ్చిందో కారణం తెలుస్తుంది.

urine burning sensation ayurvedic remedies

తరచూ అకారణంగా వచ్చే చలి జ్వరం, వికారం, వాంతి, పొత్తి కడుపులో నొప్పి, చిరాకుగా ఉండడం, మూత్రంలో దుర్వాసన, మూత్రానికి పదే పదే వెళ్లాల్సి రావడం, మంట తెలియకుండానే మూత్రం బొట్లు బొట్లుగా లీక్‌ అవడం, మూత్రం సరిగ్గా రాకపోవడం లాంటి అనుబంధ సమస్యలు కూడా ఉంటాయి.

ఆహార పానీయాలు ప్రముఖంగా ఈ మంటకు కారణమవుతుంటాయి. బాక్టీరియా దోషాలు, ఎండల కారణంగా లేదా శ్రమ కారణంగా శరీరంలో నీటి ధాతువు తగ్గిపోయి శోష ఏర్పడడం, ప్రోస్టేట్‌ గ్రంథితో తేడాలు, షుగర్‌ ఉండడం.. వంటివన్నీ మూత్రంలో మంట కలగడానికి కారణాలే.

స్త్రీలలో జననాంగం దగ్గర ఏర్పడే ఇతర వ్యాధులు మూత్రంలో మంటకు కారణం కావచ్చు. మెనోపాజ్‌ కూడా ఒక్కోసారి దీనికి కారణం అవుతుంది.

వేడి చేసినందు వల్ల మంటగా మూత్రం వస్తుంటే రెండు మూడు గ్లాసుల నీళ్లను గానీ, బార్లీ జావను గానీ, కొబ్బరినీళ్లను గానీ, పలుచని మజ్జిగను కానీ తాగితే పసుపుదనం, మంట తగ్గి మూత్రం సాఫీగా వస్తుంది. ఉసిరికాయ రసం తీసి తాగితే త్వరగా మంట తగ్గుతుంది.

మూత్ర విసర్జన సమయంలో చిక్కని స్రావం లేదా చీము జననాంగం నుంచి వెలువడుతుంటే లోపల బ్లాడర్‌ నుంచి జననాంగం లోపలి భాగం వరకు ఉన్న ప్రాంతంలో ఎక్కడో పుండు లాంటిది ఏర్పడిందని అర్థం. ఇలాంటప్పుడు సరైన యాంటీ బయోటిక్స్‌ వాడాల్సి ఉంటుంది.

ధనియాల పొడిని నీళ్లలో వేసి బాగా మరిగించి తాగితే మూత్రంలో మంట త్వరగా తగ్గుతుంది. జననాంగాల దగ్గర పరిశుభ్రత కూడా ఈ వ్యాధిలో ముఖ్యమే. తరచూ మూత్రంలో మంట వస్తుంటే మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది.

గోక్షూరాది చూర్ణం, చంద్ర ప్రభావటి, చందనాసవం లాంటి ఆయుర్వేద ఔషధాలు మంచి ఆయుర్వేద వైద్యుడి సలహా మేరకు వాడుకోవచ్చు. మంచి గంధం చెక్కని సాన మీద అరగదీసి ఒక చెంచా గంధంలో ఒకటి లేదా రెండు పలుకులు పచ్చ కర్పూరం కలిపి కొద్ది సేపు ఆరనిస్తే మాత్ర కట్టుకోవడానికి వీలుగా అవుతుంది. బఠానీ గింజలతం ఉండలుగా చేసుకుని పూటకు రెండు ఉండల చొప్పున మూడు పూటలా తీసుకోవాలి. మూత్రంలో మంట త్వరగా తగ్గుతుంది.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Tags: urine burning sensationమూత్రంలో మంట
Previous Post

అర‌టి పండ్లే కాదు.. అర‌టి పువ్వును కూడా తిన‌వ‌చ్చు.. దీంతో ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసుకోండి..!

Next Post

ఎంతో రుచికరమైన ఆగాకరకాయలు.. వీటిని తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకోండి..!

Related Posts

చిట్కాలు

వీటిని తాగితే చాలు.. కిడ్నీల్లో ఉండే ఎంత‌టి స్టోన్స్ అయినా స‌రే కరిగిపోతాయి..!

July 12, 2025
చిట్కాలు

అధిక బరువా.. పర‌గడుపున ఇది తాగండి ఇట్టే తగ్గుతారు..!!

July 11, 2025
చిట్కాలు

రెండు చుక్క‌ల వెల్లుల్లి ర‌సం చెవిలో వేస్తే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

July 11, 2025
చిట్కాలు

షుగ‌ర్ కంట్రోల్ అవ్వాలంటే రోజూ ఈ ఆకుల‌ను తినండి..!

July 11, 2025
చిట్కాలు

డెలివ‌రీ అయ్యాక మ‌హిళ‌ల‌కు ఏర్ప‌డే స్ట్రెచ్ మార్క్స్ పోవాలంటే ఇలా చేయండి..!

July 4, 2025
చిట్కాలు

ఈ ఒక్క చిట్కాను పాటిస్తే చాలు.. మీ లివ‌ర్ ఎల్ల‌ప్పుడూ క్లీన్‌గా ఉంటుంది..

July 4, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ అర‌చేతిలో…ఈ గుర్తుల్లో..ఏదైనా ఒక‌టుందా? అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా??

by Admin
July 9, 2025

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.