Flax Seeds Powder For Weight Loss : ప్రస్తుత కాలంలో మనలో చాలా మందిని వేధిస్తున్న అనారోగ్య సమస్యల్లో అధిక బరువు కూడా ఒకటి. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్య బారిన పడుతున్నారు. జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం, ఎక్కువ సేపు కూర్చుని పని చేయడం, అవసరానికి మించి ఆహారాన్ని తీసుకోవడం ఇలా అనేక కారణాల చేత అధిక బరువు సమస్య తలెత్తుతుంది. అధిక బరువు కారణంగా మనలో చాలా మంది అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. అధిక బరువు అనేక అనారోగ్య సమస్యలకు కూడా దారి తీస్తుంది.
అధిక బరువు వల్ల గుండె జబ్బులు, బీపీ, షుగర్, హార్మోన్ల అసమతుల్యత ఇలా అనేక రకాల ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కనుక మనం సాధ్యమైనంత వరకు చాలా త్వరగా అధిక బరువు సమస్య నుండి బయటపడాలి. అధిక బరువు సమస్యతో బాధపడే వారు ఇప్పుడు చెప్పే ఈ పొడిని తయారు చేసుకుని వాడడం వల్ల 10 రోజుల్లోనే మనం మన శరీరంలో వచ్చిన మార్పును గమనించవచ్చు. ఈ పొడిని వాడడం వల్ల పొట్ట చుట్టూ అలాగే ఇతర శరీర భాగాల్లో పేరుకుపోయిన కొవ్వు మొత్తం కరిగిపోతుంది.
ఈ పొడిని తయారు చేసుకోవడం అలాగే వాడడం కూడా చాలా సులభం. ఒక్కసారి ఈ పొడిని తయారు చేసుకుని మనం నెల రోజుల పాటు ఉపయోగించుకోవచ్చు. అధిక బరువు సమస్య నుండి బయటపడేసే ఈ పొడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పొడిని తయారు చేసుకోవడానికి గానూ మనం ఒక కప్పు అవిసె గింజలను, అర కప్పు జీలకర్రను, పావు కప్పు సోంపు గింజలను, ఒక కప్పు కరివేపాకును ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక కళాయిలో ఈ పదార్థాలన్నింటిని వేసి వేయించాలి.
తరువాత వీటిని జార్ లో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. ఈ పొడిని గాలి తగలకుండా నిల్వ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పొడిని రోజూ ఉదయం పరగడుపున ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో అర టీ స్పూన్ మోతాదులో కలిపి తీసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు మొత్తం కరిగిపోతుంది. మనం చాలా సులభంగా అధిక బరువు సమస్య నుండి బయటపడవచ్చు. ఈ పొడిని వాడడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు కనుక అధిక బరువు సమస్యతో బాధపడే వారు ఈ పొడిని వాడి మంచి ఫలితాలను పొందవచ్చు.