Kanuga For Skin Problems : మనకు రోడ్ల పక్కన, పార్కులల్లో ఎక్కువగా కనిపించే చెట్లల్లో కానుగ చెట్టు కూడా ఒకటి. ఈ చెట్టు తెలియని వారు ఉండరనే చెప్పవచ్చు. నీడ కోసం,చల్లటి గాలి కోసం ఈ చెట్టును చాలా మంది ఇండ్లల్లో కూడా పెంచుకుంటూ ఉంటారు. అయితే చాలా మంది కానుగ చెట్టు వల్ల మనకు ఎటువంటి ప్రయోజనాలు ఉండవని భావిస్తారు. కానీ కానుగ చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఈ చెట్టులో ప్రతి భాగం కూడా మనకు ఎంతగానో సహాయపడుతుంది. ఈ చెట్టును ఉపయోగించడం వల్ల మనం అనేక రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఈ చెట్టును ఉపయోగించడం వల్ల కంటికి సంబంధించిన సమస్యలు, చర్మ సమస్యలను, జీర్ణ సమస్యలను, దంత సమస్యలను దూరం చేసుకోవచ్చు.
అలాగే క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా కాపాడడంలో కూడా కానుగ చెట్టు మనకు దోహదపడుతుంది. కానుగ చెట్టును ఉపయోగించడం వల్ల మనం ఏయో అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. చర్మ సమస్యలను నయం చేయడంలో కానుగ గింజల పొడి ఎంతగానో సహాయపడుతుంది. కానుగ గింజల పొడికి, పసుపు కలిపి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను లేపనంగా రాయడం వల్ల గజ్జి, తామర వంటి చర్మ వ్యాధులు తగ్గుతాయి. అలాగే కానుగ గింజలను, తెల్ల గన్నేరు వేరునుపేస్ట్ గా చేసి రాసిన కూడా చర్మ సమస్యలు తగ్గుతాయి. కానుగ గింజల నూనెలో వేపనూనె కలిపి రాయడం వల్ల దురదలు తగ్గుతాయి. కడుపులో ఉండే నులిపురుగులను నశింపజేయడంలో కూడా కానుగ గింజలు మనకు దోహదపడతాయి.
కానుగ గింజల చూర్ణాన్ని, ఇంగువతో కలిపి ఉండలా చేసి తీసుకోవడం వల్ల కడుపులో ఉండే పురుగులు నశిస్తాయి. అలాగే ఈ సమస్యతో బాధపడే వారు కానుగ గింజల నుండి తీసిన నూనెలో కొద్దిగా నిమ్మరసాన్ని కలిపి తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే పిత్త దోషాలను తగ్గించడంలో కానుగ చెట్టు బెరడు మనకు దోహదపడుతుంది. కానుగ చెట్టు బెరడు పొడిని రోజూ ఉదయం, సాయంత్రం ఒక టీ స్పూన్ మోతాదులో తీసుకోవడం వల్ల పిత్త దోషాలు తొలగిపోతాయి. అలాగే బట్టతల సమస్యను నివారించడంలో కానుగ చెట్టు పూలు మనకు సహాయపడతాయి. కానుగ చెట్టు పూలను పేస్ట్ గా చేసి బట్టతలపై రాయడం వల్ల తిరిగి వెంట్రుకలు వస్తాయి. ఈ విధంగా కానుగ చెట్టు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అయితే దీనిని ఆయుర్వేద నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే ఉపయోగించాలని వారు చెబుతున్నారు.