గుమ్మడికాయలను చాలా మంది కూరగా చేసుకుని తింటుంటారు. అయితే కాయలే కాదు, వాటి లోపలి విత్తనాలను కూడా తినవచ్చు. విత్తనాల్లో ఉండే పప్పును తింటే మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. గుమ్మడికాయ విత్తనాలను రోజూ గుప్పెడు మోతాదులో తింటే కలిగే లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. గుమ్మడికాయ విత్తనాల్లో ప్రోటీన్లు, ఫైబర్, ఐరన్, ఫాస్ఫరస్, జింక్, కాల్షియం, మెగ్నిషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల శరీరానికి పోషణ లభిస్తుంది. శక్తి అందుతుంది. ఆరోగ్యంగా ఉంటాము.
2. గుమ్మడికాయ విత్తనాల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్ ను నాశనం చేసి కణాలను రక్షిస్తాయి. క్యాన్సర్లు రాకుండా చూస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వాపులను తగ్గిస్తాయి.
3. ప్రోస్టేట్, మూత్రాశయ సమస్యలు ఉన్నవారు రోజూ ఈ విత్తనాలను తింటుంటే మేలు జరుగుతుంది. ఈ విత్తనాల్లో మెగ్నిషియం అధికంగా ఉంటుంది. ఇది అనేక జీవక్రియలకు సహాయ పడుతుంది. బీపీని తగ్గిస్తుంది. హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూస్తుంది. ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. డయాబెటిస్ అదుపులో ఉండేందుకు సహాయ పడుతుంది.
4. గుమ్మడికాయ విత్తనాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, జింక్, మెగ్నిషియం, ఇతర ఫ్యాటీ యాసిడ్లు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. బీపీని అదుపులో ఉంచుతాయి.
5. గుమ్మడికాయ విత్తనాలను రోజూ తినడం వల్ల డయాబెటిస్ పూర్తిగా అదుపులో ఉంటుంది. ఈ విత్తనాల్లో ఉండే ఫైబర్ జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. ముఖ్యంగా గ్యాస్, మలబద్దకం తగ్గుతాయి.
6. గుమ్మడికాయ విత్తనాల్లో ఉండే జింక్ పురుషుల్లో వీర్యం నాణ్యతను పెంచుతుంది. దీంతో సంతానం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
7. నిద్రలేమి సమస్యతో బాధపడే వారు గుమ్మడికాయ విత్తనాలను తినడం వల్ల ఫలితం ఉంటుంది. నిద్ర చక్కగా వస్తుంది.