అధిక బరువు తగ్గేందుకు చాలా మంది అనుసరించే మార్గాల్లో గ్రీన్ టీని తాగడం కూడా ఒకటి. గ్రీన్‌టీలో అనేక ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడమే కాదు, అధిక బరువును తగ్గిస్తాయి. గ్రీన్ టీని తాగడం వల్ల శరీర మెటబాలిజం 20 శాతం మేర పెరుగుతుంది. దీంతో క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. అయితే గ్రీన్ టీలో ఈ రెండింటిని కలుపుకుని తాగడం వల్ల ఇంకా వేగంగా బరువు తగ్గవచ్చు. మరి ఆ పదార్థాలు ఏమిటంటే..
అధిక బరువును తగ్గించడంలో దాల్చిన చెక్క అద్భుతంగా పనిచేస్తుంది. దీంతో షుగర్ లెవల్స్ కూడా తగ్గుతాయి. ఇక పసుపు కూడా అనేక ప్రయోజనాలను అందిస్తుంది. అయితే ఈ రెండింటినీ గ్రీన్ టీలో కలిపి తాగవచ్చు.
ఒక కప్పు గ్రీన్ టీలో పావు టీస్పూన్ దాల్చిన చెక్క పొడి, అంతే మోతాదులో పసుపు కలిపి తాగాలి. ఇక అందులో చక్కెర, పాలు వంటివి కలపరాదు. అవసరం అనుకుంటే కొద్దిగా తేనె లేదా బెల్లం కలిపి రుచి కోసం తాగవచ్చు. ఇలా గ్రీన్ టీలో దాల్చిన చెక్క పొడి, పసుపులను కలుపుకుని రోజూ తాగుతుంటే అధిక బరువు వేగంగా తగ్గుతారు.
గ్రీన్ టీని కొందరు పొడి వేసి మరిగించి తాగుతారు. అదే సమయంలో దాల్చిన చెక్క పొడి, పసుపును వేసి మరిగించి తాగవచ్చు. అయితే గ్రీన్ టీ బ్యాగ్‌లను ఉపయోగిస్తే గనక నీటిలో ముందుగానే దాల్చిన చెక్క పొడి, పసుపు వేసి మరిగించాలి. తరువాత ఆ నీరు వేడిగా ఉండగానే గ్రీన్ టీ బ్యాగ్‌ను వేయాలి. దీంతో టీ తయారవుతుంది. ఇలా గ్రీన్ టీని తాగవచ్చు. దీంతో అధిక బరువును వేగంగా తగ్గించుకునేందుకు అవకాశం ఉంటుంది.