Custard Apple For Lungs : మనకు కాలానుగుణంగా వివిధ రకాల పండ్లు లభిస్తూ ఉంటాయి. ప్రస్తుత కాలంలో మనకు ఎక్కువగా లభించే పండ్లల్లో సీతాఫలం కూడా ఒకటి. సీతాఫలం పండ్లు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. వీటిని నేరుగా తీసుకోవడంతో పాటు వీటితో జ్యూస్, సలాడ్, ఐస్ క్రీమ్స్, మిల్క్ షేక్స్ వంటి వాటిని కూడా తయారు చేసి తీసుకుంటూ ఉంటారు. సీతాఫలం పండ్లు రుచిగా ఉండడంతో పాటు వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. వీటిలో అనేక పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగిఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా సీతాఫలాలను తీసుకోవడం వల్ల మన ఊపిరితిత్తుల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని వారు చెబుతున్నారు.
సీతాఫలం పండ్లను తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన మలినాలు కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా సీతాఫలాలను తీసుకోవడం వల్ల బ్రోన్చియల్ ట్యూబ్ ల వాపు తగ్గుతుంది. వీటిలో ఉండే యాంటీ ఇన్ ప్లామేటరీ గుణాలు వాపును తగ్గించడంలో దోహదపడతాయి. అలాగే ఉబ్బసం వ్యాధితో బాధపడే వారు సీతాఫలాలను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఉబ్బసాన్ని తగ్గించడంలో ఇవి సహజ నివారిణిగా పని చేస్తాయి. అలాగే సీతాఫలాలను తీసుకోవడం వల్ల శ్వాసకోశ వ్యవస్థలో పేరుకుపోయిన మలినాలు, విష పదార్థాలు తొలగిపోతాయి.
అలాగే వాతవరణ కాలుష్యం, ధూమపానం కారణంగా ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన హానికరమైన పదార్థాలు కూడా తొలగిపోతాయి. శ్వాసకోశ వ్యవస్థలో ఉన్న ఇబ్బందులను తొలగించి పూర్తిగా తొలగించి శ్వాసతీసుకోవడాన్ని సులభతరం చేయడంలో సీతాఫలాలు మనకు ఎంతో సహాయపడతాయి. సీతాఫలాలను తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. శ్వాస సంబంధిత అనారోగ్య సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి. సీతాఫలాలను తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు మన శరీరానికి కూడా ఎంతో మేలు కలుగుతుందని ఇవి లభించినప్పుడు ప్రతిఒక్కరు వీటిని ఎక్కువగా తీసుకునే ప్రయత్నం చేయాలని నిపుణులు చెబుతున్నారు.