సాధారణంగా వ్యాయామం చేసిన తర్వాత ఎవరైనా సరే అలసిపోతారు. అటువంటి పరిస్థితిలో వారు శక్తిని పొందేందుకు పళ్ల రసం తాగడానికి ఇష్టపడతారు. పళ్ల రసం తాగడం వల్ల శక్తి లభిస్తుంది. తాజాదనం అందుతుంది. దీంతో చాలా మంది పళ్ల రసాలను చాలా ఆరోగ్యకరమైనవిగా, ప్రయోజనకరమైనవిగా భావిస్తారు. పళ్ల రసం, పండ్లలో నిజానికి ఏవి తీసుకుంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.
1. పండ్ల రసాలలో చక్కెర, కేలరీలు ఉంటాయి. ఇవి బరువును పెంచుతాయి. కాబట్టి అధిక బరువు తగ్గాలనుకునే వారికి పళ్ల రసం పనికిరాదు. అందుకు బదులుగా వారు కూరగాయల జ్యూస్‌ను తాగాలి. బరువు పెరాగలనుకునే వారు పళ్ల రసాలను తాగాలి. పళ్ల రసాలను తాగడం వల్ల వాటితో క్యాలరీలు అధికంగా వస్తాయి. దీంతో బరువు పెరుగుతారు. కనుక బరువు తగ్గాలనుకునే వారు పళ్ల రసాలకు బదులుగా కూరగాయల రసాలను తాగితే మంచిది.
2. పళ్ల రసాలలో ఫైబర్ తక్కువగా ఉంటుంది. పండ్లతో పోలిస్తే రసాల్లో ఫైబర్ శాతం తగ్గుతుంది. అందువల్ల రసాలు జీర్ణ వ్యవస్థకు పెద్దగా పనికిరావు. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే ఫైబర్ కావాలి. అందుకు గాను పండ్లనే తినాలి, కానీ పళ్ల రసాలను తాగరాదు.
3. పళ్ల రసాలను తాగడం వల్ల కొన్ని రకాల మెడిసిన్లపై నేరుగా ప్రభావం పడుతుంది. కనుక మీకు రెగ్యులర్‌గా పళ్ల రసాలను తాగే అలవాటు ఉంటే, మీరు ఏవైనా మందులను వాడుతుంటే దుష్ప్రభావాలు కలిగే అవకాశం ఉంది. కనుక పళ్ల రసాలను తాగరాదు. ఈ విషయంలో అవసరం అయితే వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.
4. పళ్ల రసాల్లో ఫైబర్ తక్కువగా, చక్కెరలు ఎక్కువగా ఉంటాయి కనుక టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతాయి. 2019లో జరిపిన ఒక అధ్యయనం ప్రకారం, పండ్ల రసం తాగేవారు లేదా తీపి పానీయాలు తీసుకునేవారు టైప్ 2 డయాబెటిస్ బారిన పడే అవకాశాలు 16 శాతం ఎక్కువగా ఉంటాయని వెల్లడైంది. అందువల్ల పళ్ల రసాలను తాగరాదు. మీకు టైప్ 2 డయాబెటిస్ ఉంటే రసం తాగడానికి బదులుగా పండ్లను తినడానికి ప్రయత్నించండి. ఎందుకంటే పండ్లలో ఉండే ఫైబర్ మీ శరీరంపై ఎటువంటి దుష్ప్రభావాలను కలిగించదు. అంతేకాకుండా ఆ ఫైబర్ షుగర్ లెవల్స్ ను తగ్గించేందుకు సహాయ పడుతుంది. కనుక టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు పళ్ల రసాలకు బదులుగా పండ్లను తీసుకుంటే మంచిది. మేలు జరుగుతుంది.
5. పండ్లు, కూరగాయల్లో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది బీపీని తగ్గిస్తుంది. అందుకనే తాజా పండ్లు, కూరగాయలను తినాలని వైద్యులు చెబుతుంటారు. అయితే పళ్ల రసాల్లో పొటాషియం పండ్ల కన్నా ఎక్కువగా ఉంటుంది. అంత ఎక్కువ మొత్తంలో పొటాషియం మన శరీరానికి మంచిది కాదు. కనుక పళ్ల రసాలను తాగకూడదు. లేదంటే కిడ్నీలపై భారం పెరుగుతుంది. కిడ్నీ సమస్యలు వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎటు చూసినా పళ్ల రసాలు మంచివి కావని తెలుస్తుంది. కనుక నేరుగా పండ్లనే తింటే మంచిది. అయితే జిమ్ చేసేవారు, బరువు పెరగదలుచుకున్న వారు, శక్తి ఎక్కువగా కావల్సిన వారు పళ్ల రసాలను తాగవచ్చు. మిగిలిన వారు పళ్ల రసాలను కాకుండా పండ్లను తీసుకుంటే మంచిది.