Heart Problem Symptoms : ప్రస్తుత కాలంలో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుందని చెప్పవచ్చు. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్య బారిన పడుతున్నారు. మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్లే గుండెపోటు రావడానికి ప్రధాన కారణాలని చెప్పవచ్చు. ఇలా గుండెపోటుతో మరణించే వారిలో యువత ఎక్కువగా ఉండడం మనల్ని మరింత ఆందోళనకు గురి చేస్తుంది. గుండెపోటు రాగానే సమయానికి తగిన చికిత్స అందక చాలా మంది మరణిస్తున్నారు. అలాగే గుండెపోటు అనే ఈ సమస్యపై సరైన ఆవగాహన లేకపోవడం కూడా మరణానికి మరో కారణమని చెప్పవచ్చు. సాధారణంగా గుండెపోటు వచ్చే ముందు మనలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ఈ లక్షణాలను మనం గమనించిన వెంటనే వైద్యున్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. గుండెపోటు వచ్చే కనిపించే లక్షణాల గురించి తెలుసుకోవడం వల్ల ప్రాణాలు పోకుండా కాపాడుకోవచ్చు. గుండెపోటు వచ్చే ముందు మనలో కనిపించే లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గుండెపోటు వచ్చే ముందు చెమటలు ఎక్కువగా పడతాయి. వాతావరణం సాధారణంగా ఉన్నప్పటికి చెమటలు ఎక్కువగా పడుతూ ఉంటాయి. రాత్రి సమయంలో చెమటలు మరింత ఎక్కువగా పడతాయి. అలాగే ఉదయం నిద్రలేచేటప్పుడు ఎడమచేతి వైపు నొప్పిగా ఉంట అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే వైద్యున్ని సంప్రదించడం మంచిది. అలాగే ఎడమ చేతి భుజం, చెయ్యి, దవడ, మోచేయి, ఛాతిలో నొప్పిగా ఉన్నా కూడా వైద్యున్ని సంప్రదించడం మంచిది.
అలాగే ఉదయం పూట నిద్రలేవగానే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఇది కూడా గుండెపోటు వచ్చే ముందు కనిపించే లక్షణాల్లో ఒకటి. అలాగే మాట్లాడేటప్పుడు, నడిచేటప్పుడు కూడా ఛాతిలో నొప్పిగా, భారంగా ఉంటుంది. శ్వాస తీసుకోవడం వల్ల ఇబ్బందిగా ఉంటుంది. ఆయాసం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఉదయం నిద్ర లేచిన తరువాత తలంతా భారంగా ఉంటుంది. ఆందోళన, గందరగోళంగా ఉంటుంది. ఈ విధంగా ఇటువంటి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యున్ని సంప్రదించడం మంచిది. కొన్నిసందర్భాల్లో ఈ సంకేతాలు గుండెపోటుకు కారణం కాకపోవచ్చు. కానీ నిర్లక్ష్యం చేయడం అస్సలు మంచిది కాదు.