వెల్లుల్లి రెబ్బలను నిత్యం తినడం వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి. వెల్లుల్లిలో మనకు ఆరోగ్యాన్నిచ్చే అనేక ఔషధ గుణాలు ఉంటాయి. అయితే వెల్లుల్లిని నేరుగా తినడం కంటే వాటిని మొలకెత్తించి తినడం వల్ల రెట్టింపు స్థాయిలో మనకు లాభాలు కలుగుతాయి.
వెల్లుల్లిపాయలను ఇలా మొలకెత్తించవచ్చు
ఒక కప్పు లేదా గ్లాస్‌లో దాని పై భాగం వరకు శుభ్రమైన నీటిని నింపాలి. అనంతరం ఒక వెల్లుల్లి రెబ్బ లేదా పూర్తిగా వెల్లుల్లి మొత్తాన్ని తీసుకుని దానికి చిత్రంలో చూపినట్టుగా 3 వైపులా టూత్‌పిక్‌లను గుచ్చాలి. అనంతరం ఆ టూత్‌పిక్‌ల సహాయంతో వెల్లుల్లిపాయలను కప్పు పై భాగంలో ఉంచాలి. అయితే వెల్లుల్లి కింది భాగంలో ఉండే వేర్ల వరకు మాత్రమే నీటిలో మునిగేలా వెల్లుల్లిని ఉంచాలి. అంతే.. ఒక 5 రోజులు ఆగితే వెల్లుల్లిపాయలు మొలకెత్తుతాయి. ఇక వెల్లుల్లిని ఉంచే కప్పు లేదా గ్లాస్‌లను కిటికీల వంటి ప్రదేశాల్లో, ఇతర సూర్యరశ్మి తగిలే ప్రాంతాల్లో ఉంచాలి. దీంతో మొలకలు బాగా వస్తాయి. తరువాత వాటిని నేరుగా తీసుకోవచ్చు. లేదా ఆహారంలో కలిపి వాడవచ్చు.
1. మొలకెత్తిన వెల్లుల్లిపాయల్లో సాధారణ వెల్లుల్లిపాయల కన్నా ఒక మోస్తరు ఎక్కువగానే యాంటీ యాక్సిడెంట్లు ఉంటాయి. మొలకెత్తుతున్న వాటిలో మెటాబొలెట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇవి మొలకలు మొక్కలుగా మారేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఆ క్రమంలో వాటికి వ్యాపించే చీడ పీడల నుంచి మొక్కలకు రక్షణనిస్తాయి. అలాంటిది ఆ మెటాబొలెట్స్ ఉన్న మొలకెత్తిన వెల్లుల్లిపాయల్ని తింటే మనకు కూడా అలాంటి లాభాలే కలుగుతాయి. ప్రధానంగా పలు రకాల వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు నయం అవుతాయి.
2. మొలకెత్తిన వెల్లుల్లిపాయల్ని తింటే రక్త నాళాల్లో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది. రక్త సరఫరా మెరుగు పడి గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.
3. మొలకెత్తుతున్న వెల్లుల్లిపాయల్లోని యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతాయి. క్యాన్సర్ రాకుండా చూడడమే కాదు, క్యాన్సర్ కణాలను వృద్ధి చెందనీయవు.
4. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న కారణంగా వయస్సు మీద పడడం వల్ల వచ్చే ముడతలు పోతాయి. దీంతో చర్మం యవ్వనంగా, కాంతివంతంగా మారుతుంది.
5. మొలకెత్తిన వెల్లుల్లిపాయలను తింటుంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. చిన్నారులకు తినిపిస్తే వారి మెదడు వికసిస్తుంది. బుద్ధి పెరుగుతుంది. నాడులన్నీ ఉత్తేజం అవుతాయి.