Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Hyderabad Style Egg Kurma : హైద‌రాబాద్ స్టైల్‌లో ఎగ్ కుర్మాను ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!

D by D
March 14, 2024
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Hyderabad Style Egg Kurma : హైద‌రాబాద్ స్టైల్ ఎగ్ కుర్మా.. కోడిగుడ్ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ఇది కూడా ఒక‌టి. ఈ ఎగ్ కుర్మా చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. నోటికి రుచిగా తినాల‌నిపించిన‌ప్పుడు, వెరైటీగా ఏదైనా త‌యారు చేసి తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా ఎగ్ కుర్మాను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. దేనితో తినడానికైనా ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. ఎంతో రుచిగా, క‌మ్మ‌గా ఉండే ఈ ఎగ్ కుర్మాను హైద‌రాబాద్ స్టైల్ లో ఎలా త‌యారు చేసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.

హైద‌రాబాద్ స్టైల్ ఎగ్ కుర్మా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ప‌ల్లీలు – 2 టేబుల్ స్పూన్స్, ఎండు కొబ్బ‌రి ముక్క‌లు – ఒక టేబుల్ స్పూన్, నువ్వులు – ఒక టేబుల్ స్పూన్, గ‌స‌గ‌సాలు – ఒక టీ స్పూన్, నూనె – ఒక టేబుల్ స్పూన్, పొడుగ్గా త‌రిగిన ఉల్లిపాయ – 1, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, ప‌సుపు – పావు టీ స్పూన్, ఉప్పు- త‌గినంత‌, కారం – ఒక టేబుల్ స్పూన్, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్, ధ‌నియాల పొడి – అర టీ స్పూన్, పెరుగు – పావు క‌ప్పు, నీళ్లు – ఒక క‌ప్పు, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, త‌రిగిన పుదీనా – కొద్దిగా, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 3, ఉడికించిన కోడిగుడ్లు – 4.

Hyderabad Style Egg Kurma recipe very tasty if you make like this
Hyderabad Style Egg Kurma

హైద‌రాబాద్ స్టైల్ ఎగ్ కుర్మా త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో ప‌ల్లీలు, ఎండుకొబ్బ‌రి ముక్క‌లు, నువ్వులు, గ‌స‌గ‌సాలు వేసి దోర‌గా అయ్యే వ‌ర‌కు వేయించి జార్ లోకి తీసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి మెత్త‌బ‌డే వ‌ర‌కు వేయించి వీటిని కూడా జార్ లోకి తీసుకోవాలి. త‌రువాత వీటిని మెత్త‌ని పేస్ట్ లాగా చేసుకుని ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత క‌ళాయిలో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత జీల‌క‌ర్ర వేసి వేయించాలి. త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత ఉప్పు, ప‌సుపు వేసి క‌ల‌పాలి. త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న పేస్ట్ వేసి క‌ల‌పాలి.

దీనిపై మూత పెట్టి నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించిన త‌రువాత కారం, ధ‌నియాల పొడి, గ‌రం మ‌సాలా వేసి క‌ల‌పాలి. త‌రువాత పెరుగు వేసి క‌ల‌పాలి. దీనిపై మూత పెట్టి 5నిమిషాల పాటు ఉడికించిన త‌రువాత క‌రివేపాకు, కొత్తిమీర‌, పుదీనా, ప‌చ్చిమిర్చి వేసి క‌ల‌పాలి. త‌రువాత నీళ్లు పోసి క‌ల‌పాలి. ఇప్పుడు కోడిగుడ్ల‌కు గాట్లు పెట్టి వేసుకోవాలి. త‌రువాత మూత పెట్టి నూనె పైకి తేలే వ‌రకు బాగా ఉడికించాలి. చివ‌ర‌గా కొత్తిమీర‌ను చల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే హైద‌రాబాద్ స్టైల్ ఎగ్ కుర్మా త‌యార‌వుతుంది. దీనిని అన్నం, రోటీ, చ‌పాతీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. కోడిగుడ్ల‌తో త‌రుచూ ఒకేర‌కం వంట‌కాలు కాకుండా ఇలా వెరైటీగా కూడా త‌యారు చేసి తీసుకోవ‌చ్చు.

Tags: Hyderabad Style Egg Kurma
Previous Post

Pumpkin Seeds For Brain : వీటిని రోజూ తింటే చాలు.. మీ మెద‌డు చిట్టి రోబో క‌న్నా వేగంగా ప‌నిచేస్తుంది..!

Next Post

Lemon Juice With Turmeric And Black Pepper : రోజూ నిమ్మ‌ర‌సంలో కాస్త ప‌సుపు, మిరియాల పొడి క‌లిపి తాగితే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Related Posts

చిట్కాలు

ఈ ఒక్క చిట్కాను పాటిస్తే చాలు.. మీ లివ‌ర్ ఎల్ల‌ప్పుడూ క్లీన్‌గా ఉంటుంది..

July 4, 2025
ఆధ్యాత్మికం

ఈ పొర‌పాట్ల‌ను మీరు కూడా చేస్తున్నారా..? అయితే మీ ఇంట్లో ధ‌నం నిల‌వ‌దు జాగ్ర‌త్త‌..!

July 4, 2025
ఆధ్యాత్మికం

శుక్ర‌వారం నాడు ఇలా చేస్తే మీపై ల‌క్ష్మీదేవి క‌టాక్షం వ‌ర్షిస్తుంది..!

July 4, 2025
vastu

వాస్తు ప్రకారం ఈ మొక్క‌ల‌ను ఇంటి ప్ర‌ధాన ద్వారం వద్ద పెంచ‌కూడ‌దు..!

July 4, 2025
వినోదం

తండ్రి కొడుకులు కలిసి నటించినా హిట్ చేసుకోలేక డిజాస్టర్లు గా మిగిలిపోయిన సినిమాలు !

July 4, 2025
వినోదం

హీరో అవ్వకముందు చిరంజీవి – కమెడియన్ సుధాకర్ ఇన్ని కష్టాలని పడ్డారా ?

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.