స్త్రీ, పురుషుల మధ్య ఉండే బంధం చాలా పవిత్రమైంది. పెళ్లి బంధంతో వారు ఒక్కటవుతారు. జీవితాంతం కలసి మెలసి కాపురం చేస్తామని, అన్యోన్యంగా ఉంటామని ప్రమాణాలు చేసుకుంటారు. కానీ కొంత కాలం తరువాత విడిపోతారు. ఈ మధ్య కాలంలో చాలా మంది విడాకులు తీసుకుంటున్నారు. సెలబ్రిటీలు ఈ జాబితాలో ముందు వరుసలో ఉన్నారని చెప్పవచ్చు.
ఇక ఈ మధ్య కాలంలో విడాకులకు చాలా వరకు అక్రమ సంబంధాలే కారణమవుతున్నాయి. భర్త లేదా భార్య ఇంకొకరితో సంబంధం పెట్టుకోవడం వల్ల అది తమ భాగస్వామికి నచ్చక విడాకులు తీసుకుంటున్నారు. అయితే అక్రమ సంబంధాలు ఎందుకు పెట్టుకుంటారు ? అనే విషయంపై ఇంగ్లండ్ కు చెందిన ఓ సంస్థ సర్వే చేసింది.అందులో షాకింగ్ నిజాలు వెల్లడయ్యాయి. ఆ వివరాలను ఒక్కసారి పరిశీలిస్తే..
బ్రిటన్‌కు చెందిన సోషల్ ఇన్‌సైట్ అనే ఓ సంస్థ ఈమధ్యే అక్రమ సంబంధాలపై ఓ సర్వే చేసింది. అందులో షాకింగ్ నిజాలను వెల్లడించారు. సర్వేలో స్త్రీలు, పురుషులు పాల్గొన్నారు. వారు అక్రమ సంబంధాలు పెట్టుకున్న వారే కావడం విశేషం. వారు అలా ఎందుకు ఇంకొకరితో సంబంధం పెట్టుకుంటున్నారు.. అనే విషయాన్ని కూడా సేకరించారు. దీంతో చాలా మంది చెప్పిన కారణం ఏమిటంటే.. పెళ్లయిన తరువాత కొంత కాలానికి తమ జీవిత భాగస్వామి తమకు సమయం కేటాయించకపోవడం, ప్రేమించకపోవడం, ఎమోషనల్‌గా కనెక్ట్ కాకపోవడంతోనే చాలా మంది అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నట్లు వెల్లడించారు. దీంతో ఆశ్చర్యపోవడం పరిశోధకుల వంతైంది. ఏది ఏమైనా ఈ మధ్య కాలంలో అక్రమ సంబంధాలు, విడాకులు బాగా పెరిగిపోయాయనే చెప్పవచ్చు.