మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల కూరగాయల్లో బెండకాయలు కూడా ఒకటి. ఇవంటే చాలా మందికి ఇష్టమే. బెండకాయలను చాలా మంది అనేక రకాలుగా వండుకుని తరచూ తింటుంటారు. బెండకాయతో చేసే వేపుడు ఎంతో రుచిగా ఉంటుంది. దీంతో పులుసు కూడా పెట్టుకోవచ్చు. అయితే బెండకాయలను తినడం వల్ల మనకు అనేక లాభాలు కలిగే మాట వాస్తవమే అయినప్పటికీ కొందరు మాత్రం వీటిని తినకూడదు. ఇక ఎవరెవరు ఈ కాయలను తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
అలర్జీల సమస్య ఉన్నవారు బెండకాయలను తినకూడదు. తింటే సమస్య మరింత ఎక్కువవుతుంది. దీంతో చర్మంపై దురదలు, దద్దుర్లు, వాపులు వస్తాయి. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది. పొట్టలో నొప్పి కూడా వస్తుంది. అలాగే మలబద్దకం, విరేచనాలు, ఐబీఎస్ వంటి జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్నవారు కూడా బెండకాయలను తినకూడదు. షుగర్ పేషెంట్లు బెండకాయలను తినే సమయంలో జాగ్రత్త వహించడం మంచిది. ఎందుకంటే వీటిని మరీ అతిగా తింటే షుగర్ లెవల్స్ పడిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు డాక్టర్ సలహా మేరకు బెండకాయలను తినాల్సి ఉంటుంది.
పాలిచ్చే తల్లులు, గర్భంతో ఉన్నవారు బెండకాయలను తినకూడదు. డాక్టర్ ను అడిగిన తరువాతే వీటిని తినాల్సి ఉంటుంది. అయితే బెండకాయలతో మనం వాస్తవానికి అనేక ప్రయోజనాలు పొందవచ్చు. కానీ పైన చెప్పిన అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ వీటిని తినకూడదు. తింటే కోరి సమస్యలను తెచ్చుకున్నట్లు అవుతుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి.