జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మనకు 12 రాశులు ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఎవరి జాతకం అయినా సరే లేదా ఆ వ్యక్తి ప్రవర్తన అనేది జాతకంపై ఆధార పడి ఉంటుంది. వ్యక్తి గ్రహాల కదలికలు, రాశి ఫలితాలను బట్టి భవిష్యత్ మారుతుంది. అయితే కొన్ని మాత్రం రాశులపై ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా వ్యక్తుల యొక్క శృంగార కాంక్ష, రసికత అనేది రాశులను బట్టి మారుతుందట. కొన్ని రాశుల వారు అందులో ఎక్స్‌పర్ట్‌లుగా ఉంటారట. వారు తమ జీవిత భాగస్వామిని బాగా సంతృప్తి పరచగలరట. ఇంకెందుకాలస్యం ఆ రాశులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి వారు శృంగారంలో చాలా యాక్టివ్‌గా ఉంటారట. ఈ రాశికి అంగారకుడు అధిపతి. కనుక వీరు తమ జీవిత భాగస్వామికి ఆ విషయంలో అమితమైన ఆనందాన్ని ఇస్తారట. అలాగే శృంగార సామర్థ్యం, శృంగార కాంక్ష చాలా ఎక్కువగా ఉంటుందట. కాబట్టి ఇలాంటి భాగస్వామి లభిస్తే విడిచిపెట్టకూడదని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
ఇక వృషభ రాశి వారు కూడా మంచి రసికులే అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. వీరు ఎల్లప్పుడూ రొమాంటిక్ మూడ్‌లో ఉంటారట. క్రియేటివ్‌గా ఆలోచిస్తారట. అందువల్ల వీరు కూడా తమ జీవిత భాగస్వామిని బాగానే సంతృప్తి పరచగలిగే శక్తిని కలిగి ఉంటారట. అలాగే వృశ్చికం, మీన రాశులకు చెందిన వారు కూడా ఈ కార్యంలో బాగానే రాణిస్తారట. అందువల్ల ఇలాంటి భాగస్వాములను వివాహం చేసుకోవాలని జ్యోతిష శాస్త్రం చెబుతోంది.