ప్రస్తుతం నడుస్తున్నది బిజీ యుగం. భార్యాభర్త ఇద్దరూ ఉద్యోగం చేసే వారు కావడంతో నిత్యం పని ఒత్తిడిని అధికంగా ఎదుర్కొంటున్నారు. దీంతో శృంగారం చేసేందుకు సమయం ఉండడం లేదు. రాత్రిళ్లు ఆలస్యంగా పడుకుని ఉదయం ఆలస్యంగా నిద్ర లేస్తున్నారు. అయితే శృంగారంలో పాల్గొనాలంటే చక్కని మూడ్ ఉండాలి. అలాంటి మూడ్‌ను రప్పించేందుకు గాను మీ బెడ్‌రూమ్‌లో పలు రంగులతో గోడలకు పెయింట్ వేసుకోవాలి. కొన్ని రకాల రంగులను చూస్తే ఆటోమేటిగ్గా మనకు మూడ్ వస్తుందట. కనుక అలాంటి రంగులను పెయింటింగ్ వేయించుకోండి. దీంతో మంచి మూడ్ వచ్చి శృంగారంలో చురుగ్గా పాల్గొంటారు. ఇక అందుకు ఎలాంటి పెయింటింగ్‌లను వేయించాలో ఇప్పుడు చూద్దాం.
పింక్ కలర్‌ను సహజంగానే రొమాన్స్‌కు చిహ్నంగా భావిస్తారు. దీన్ని చూస్తే చాలా మందికి ఆహ్లాదంగా అనిపిస్తుందట. చక్కని మూడ్ వస్తుందట. కనుక మీ బెడ్‌రూమ్‌ను పింక్ మయంగా మార్చేయండి. గోడలతో సహా అన్నీ పింక్ రంగులో ఉండేలా చూడండి. మూడ్ వచ్చి శృంగారంలో చురుగ్గా పాల్గొంటారు. అలాగే లేత గోధుమ రంగు కూడా మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుందట. కనుక బెడ్‌రూమ్ గోడలకు ఈ పెయింట్‌ను కూడా వేయించుకోవచ్చు.
ఇక బర్గండీ, లావెండర్, సేజ్ గ్రీన్, నేవీ బ్లూ వంటి రంగులను కూడా బెడ్ రూమ్‌లో గోడలకు వేయించుకోవచ్చు. ఇవి కూడా మనస్సుకు ఆహ్లాదాన్ని అందిస్తాయి. మూడ్ ను మారుస్తాయి. దీంతో శృంగార కాంక్ష పెరుగుతుంది. భార్యాభర్తల దాంపత్య జీవితం బాగుంటుంది. కనుక వెంటనే బెడ్ రూమ్ గోడలకు ఈ మార్పులు చేయించుకోండి.