టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందిపోయింది. ఎంతలా అంటే మనిషి దానికి అలవాటు పడిపోయేలా. చాలా మంది వివిధ రకాల వాటికి అలవాటు పడిపోతున్నారు. ముఖ్యంగా ఎక్కువ మంది పోర్న్ కి బానిస అవుతున్నారు. ఈ పదాలు కొత్తవి కాదు. మిలియన్ సార్లు విని ఉండొచ్చు. దాని ప్రమాదకరమైన ప్రభావాల గురించి తెలుసుకున్న తర్వాత కూడా.. జరిగే పరిణామాలు గురించి గుర్తించకుండానే మీరు కొనసాగించవచ్చు. అయితే, నేషనల్ మెడిసిన్ జోనల్ ఆఫ్ ఇండియా ప్రకారం 8.3% మహిళలు పోర్నోగ్రఫీని ఉపయోగిస్తున్నారు. ఇది సింగిల్ గా ఉండే వాళ్ళకి, సింగిల్ పేరెంట్స్ వాళ్లకి సాధారణమే.
అయితే, పోర్న్ కి ఎడిక్ట్ అయినప్పుడు బాడీ అనేక సిగ్నల్స్ ని పంపిస్తుంది. వాటిని ఆపమని మానసిక ఆరోగ్యాన్ని గురించి జాగ్రత్తలు తీసుకోమన్నట్లు సూచనలు ఇస్తుంది. వీటిని గమనిస్తే ఆరోగ్యం బాగుంటుంది. ఈ లక్షణాల గురించి ఇప్పుడే తెలుసుకోండి.. ఇలా కనుక జరుగుతున్నట్లయితే పోర్న్ మానేయడం మంచిది.
పోర్న్ ఏ జీవితమైపోవడం, పర్సనల్ కేర్ గురించి పట్టించుకోకపోవడం, మీకు నచ్చిన వాటిని చేయడం మానేసి కేవలం దీనికి మాత్రమే బానిస అయిపోవడం, దేని మీద ఆసక్తి లేకపోవడం, ఇతరులతో మాట్లాడడానికి తక్కువ ఆసక్తి చూపించడం, రిలేషన్ షిప్ లో ఇబ్బందులు ఎదుర్కోవడం. ఇలా కనుక జరుగుతుంటుంటే వెంటనే పోర్న్ ని చూడడం మానేయాలి.