Pooja : మీకు కష్టాలు అధికంగా ఉన్నాయా ? ఏ సమస్యా పరిష్కారం కావడం లేదా ? ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు.. ఇలా అన్ని విషయాల్లోనూ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారా ? అయితే మీ ఇంట్లో పూజ గదిలో చెంబును ఉంచి దాంతో కింద చెప్పిన విధంగా చేయండి. అన్ని సమస్యలు తొలగిపోతాయి.
పూజ గదిలో చెంబును ఉంచి అందులో శుభ్రమైన మంచినీటిని పోయాలి. తరువాత పూజ చేయాలి. నీటితో పూజ చేయడం వల్ల సర్వ దేవతలు సంతృప్తి చెందుతారని పండితులు చెబుతున్నారు. నీటిని ప్రతి ఒక్క దేవుడు, దేవత నైవేద్యంగా స్వీకరిస్తారు. దీన్ని వారు మహా నైవేద్యంగా భావిస్తారు. అందుకనే పూజ గదిలో చెంబును ఉంచి అందులో నీరు పోసి పూజ చేయడం వల్ల సకల దేవతలు సంతృప్తి చెందుతారు. వరాలను అనుగ్రహిస్తారు. దీంతో సమస్యల నుంచి గట్టెక్కవచ్చు.
రాగి చెంబులో మంచినీటిని పోసి పూజ చేయాలి. తరువాత ఆ నీటిని ఇంటిల్లిపాది సేవించాలి. దీంతో సమస్త దోషాలు తొలగిపోతాయి. ఇంట్లో అందరూ తాగగా మిగిలిన నీటిని ఇంటి పరిసరాల్లో ఉండే మొక్కలకు పోయాలి. ఏరోజుకారోజు పూజకు శుభ్రమైన మంచినీటిని వాడాలి.
చెంబులో నీటిని ఉంచి పూజ చేయడం వల్ల ఇంట్లో ఉండే దుష్ట శక్తులు పోతాయి. నెగెటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దీంతో ఇంట్లోని అందరికీ సమస్యలు తగ్గుతాయి. ఆరోగ్యంగా ఉంటారు. ధనం సంపాదిస్తారు. సంపాదించే డబ్బు చేతిలో నిలుస్తుంది. ఆర్థిక సమస్యలు పోతాయి.