Sea Salt : ప్రతి ఇంట్లో కూడా ఏదో ఒక సమస్య ఉంటుంది. ఏ సమస్య లేకుండా సంతోషంగా జీవించే వాళ్ళు ఎవరు ఉంటారు..? ప్రతి ఒక్కరు కూడా సమస్యలన్నిటికీ దూరంగా ఉండాలని చక్కగా ఆనందంగా ఉండాలని ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలని కోరుకుంటూ వుంటారు. ప్రతి సమస్యకి కూడా పరిష్కారం ఉంటుంది. ఆర్థిక సమస్య మానసిక సమస్య ఇలా ఏ సమస్య ఉన్నా కూడా వాస్తుతో పరిష్కారం ఉంటుంది. అయితే ఆర్థిక సమస్యలతో మానసిక సమస్యలతో మీరు బాధపడుతున్నారా.. కచ్చితంగా ఈ విషయాలని చూడాల్సిందే.
ఇలా ఆచరించారంటే కచ్చితంగా ఆర్థిక సమస్యలు మానసిక సమస్యలు లేకుండా హాయిగా ఉండొచ్చు. కంటికి తెలియని ప్రతికూల శక్తుల కారణంగా ఇలాంటి ఇబ్బందులు అనేవి కలుగుతుంటాయి. వాటి నుండి బయట పడొచ్చు. రాళ్ల ఉప్పుతో పరిష్కారం లభిస్తుంది. కంటి దృష్టి లోపాలని తొలగించడానికి రాళ్ల ఉప్పు ఎంతో చక్కగా పనిచేస్తుంది. దీనికోసం ముందు మీరు ఒక గాజు బౌల్ ని తీసుకుని అందులో వంటకి ఉపయోగించే రాళ్ల ఉప్పుని వేయండి దానిని మీరు బాత్రూంలో పైన పెట్టండి.
నీళ్లు పడకుండా చూసుకోండి. నీళ్లు పడితే ఉప్పు కరిగిపోతుంది. మీరు కనుక ఇలా రాళ్ళ ఉప్పు బౌల్ ని పెట్టారంటే సమస్యలన్నీ గట్టు ఎక్కవచ్చు. వారానికి ఒక సారి మీరు స్నానం చేసేటప్పుడు చిటికెడు పసుపు ఒక టీ స్పూన్ రాళ్ల ఉప్పుని వేసి స్నానం చేస్తే ప్రతికూల శక్తి పోతుంది. మంచి ఎనర్జీ వస్తుంది.
ఆర్థిక ఇబ్బందులు గట్టెక్కాలంటే మీరు డబ్బులు పెట్టుకునే పర్సు లో రాళ్ళ ఉప్పుని పేపర్లో మడతపెట్టి పర్సు లో పెడితే ఆర్థిక బాధలు పోతాయి. బెడ్రూం లో అల్మారా లో మీరు రాళ్ల ఉప్పు బౌల్ ని పెడితే మీ భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది ఇబ్బందులు పోతాయి. వారానికి ఒక సారి బౌల్లో ఉప్పుని మారుస్తూ ఉండండి. రోజు ఉపయోగించే వాహనాలను ఉప్పుతో కడిగితే కూడా నెగటివ్ ఎనర్జీ పోతుంది.