Dreams : ప్రతి రోజూ మనకి కలలు సర్వసాధారణంగా వస్తూ ఉంటాయి. నిద్రపోయినప్పుడల్లా ఏదో ఒక కల వస్తూనే ఉంటుంది. కొన్నిసార్లు భయంకరమైన కలలు కూడా వస్తూ ఉంటాయి. అయితే స్వప్న శాస్త్రం ప్రకారం చూస్తే కొన్ని కలలు వచ్చాయి అంటే అది ఎంతో శుభం. ఒకవేళ కనుక అలాంటి కలలు వస్తే మీ జీవితం మారిపోతుంది. అదే కొన్ని కలలు వచ్చాయంటే అవి అశుభాన్ని కలిగిస్తాయి. దాంతో మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది.
మంచి కలలు వచ్చాయి అంటే వ్యక్తి జీవితం సంతోషంగా ఉంటుందట. మనం చూసే ప్రతి కలకి కూడా సొంత అర్థం ఒకటి ఉంటుంది అని డ్రీమ్ సైన్స్ చెబుతోంది. అయితే ఇటువంటి కలలు వస్తే మాత్రం జాగ్రత్తగా ఉండాలి. కలలో నల్ల కాకి కనిపిస్తే అది అశుభం. పెద్ద ప్రమాదాన్ని అది సూచిస్తుంది. ఈ కల కనిపించినప్పుడు వ్యక్తి మరణ వార్త వింటాడు.
కలలో పక్షులు ఎగురుతున్నట్లు కనపడితే, డబ్బు నష్టం కలుగుతుంది పేదరికం అనుభవించాల్సి ఉంటుంది. ఇలాంటి కలలు అసలు మంచివి కాదు. కలలో పెద్ద శబ్దాలను వింటే, ఇంట్లో కుటుంబ సమస్యలు వస్తూ ఉంటాయి. కలలో హింసాత్మక జంతువులు కనపడితే కూడా మంచిది కాదు. ఆర్థిక నష్టానికి ఇది సంకేతం. తుఫాను వంటివి కనబడితే దురదృష్టం కలుగుతుంది. కలలో రక్తస్రావం కనపడినప్పుడు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు గురవుతారని దానికి సంకేతం.
ఎద్దుల బండిని కలలో చూసినట్లయితే, భవిష్యత్తు వైఫల్యాలని సూచిస్తున్నట్లు. చీకటి మేఘాలు కనుక కలలో కనపడ్డాయి అంటే, అడ్డంకులు రాబోతున్నట్లు దానికి సంకేతం. సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ కనపడితే, జీవితంలో ఏదో సమస్య వస్తున్నట్టు అర్థం. నలుపు రంగు వస్తువులు, నల్లటి వస్త్రాలు ధరించిన వ్యక్తి కనపడితే అనారోగ్యానికి సంకేతం. ఇలా కలలని బట్టి కూడా మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా అనేది మనం తెలుసుకోవచ్చు.