Mutton: చికెన్ కన్నా మటన్ ఎంతో బలవర్ధకమైన ఆహారం. అందులో కొవ్వు ఎక్కువగా ఉంటుంది కానీ.. దాన్ని తీసేసి తింటే ఎన్నో పోషకాలు లభిస్తాయి. ముఖ్యంగా విటమిన్ బి12 మటన్ ద్వారా ఎక్కువగా లభిస్తుంది. అయితే మార్కెట్‌కు వెళ్లినప్పుడు లేత మటన్ ఏది, ముదురు మటన్ ఏది ? అని కొందరు అంచనా వేయలేకపోతుంటారు. అలాంటి వారు కింద తెలిపిన పలు సూచనలను పాటించడం ద్వారా రెండు మటన్‌ల మధ్య ఉన్న తేడాలను గమనించవచ్చు. మరి ఆ సూచనలు ఏమిటంటే..
* లేత మటన్ లేత ఎరుపు రంగులో ఉంటుంది. అది చాలా మృదువుగా ఉంటుంది. ముదురు మటన్ డార్క్ రెడ్‌లో ఉంటుంది. ఆ మటన్ చాలా కఠినంగా అనిపిస్తుంది.
* లేత మటన్ మీద కొవ్వు తెల్లగా, లేత పసుపు రంగులో ఉంటుంది. ముదురు మటన్ మీద కొవ్వు పసుపు లేదా బూడిద రంగులో కనిపిస్తుంది. ఇక లేత మటన్ నుంచి కొవ్వును సులభంగా వేరు చేయవచ్చు. ముదురు మటన్ నుంచి కొవ్వును సులభంగా వేరు చేయలేము. అది చాలా గట్టిగా ఉంటుంది.
* లేత మటన్ కొద్దిగా వాసన వస్తుంది. ముదురు మటన్ అంతగా వాసన రాదు.
* లేత మటన్‌పై వేలితో నొక్కితే సొట్టలు ఏర్పడుతాయి. వెంటనే అవి సమం అవుతాయి. ముదురు మటన్ ఇలా అవదు.
* లేత మటన్ అయితే పక్కటెముకలు చిన్నగా ఉంటాయి. ముదురు మటన్ అయితే ఎముకలు పెద్దగా ఉంటాయి.
* తోక చిన్నగా ఉంటే లేత మటన్ అన్నట్లు లెక్క. పెద్దగా ఉంటే ముదురు మటన్ అని తెలుసుకోవాలి.